మేడ్చల్ జిల్లా: మల్కాజిగిరి కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెల్లిని చూడా లని బైక్‌పై వెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టడంతో మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గోదావరిఖనికి చెందిన మర్రి ప్రశాంత్ (35) మెడికల్ రిప్రజెంటేటివ్.
భార్య శ్రావణి (33), కుమారుడు సహస్రన్ (10)తో కలిసి రాంనగర్ లో నివసిస్తున్నారు. ఆదివారం మేడిపల్లిలో నివాసం ఉంటున్న తన చెల్లి ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా స్పార్క్ ఆస్పత్రి సమీపం వరంగల్ హైవేలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కియా కారు అదుపుతప్పి బైక్‌ను బలంగా ఢీకొట్టి కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లినట్లు సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి.
ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య శ్రావణికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. కుమారుడు సహస్రన్కు స్వల్పగాయాలు కాగా అత న్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నా రు. బాలుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపా రు. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్, యజమాని ఉన్నారు. వీరిని మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని కార్‌ను సీజ్‌చేసి విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు.
Also read
- మరోసారి బయటపడ్డ సుకేష్ గుప్తా ‘గోల్డ్ మాల్’.. ఏకంగా నిజాం నగలకే ఎసరు..!
- ఏంటక్కా ఇది.. టిప్‌టాప్‌గా కారు దిగింది.. ఆ తర్వాత లవర్ కోసం చేయకూడని పని చేసి..
- వాడంతే.. అదో టైపు.. దొంగతనం చేస్తాడు.. ఇట్టే దొరికిపోతాడు..
- షాకింగ్.. 180 మంది అమ్మాయిల 350 వీడియోలు తీసి.! ఆ తర్వాత..
- ఇదేం ట్విస్ట్.. అత్తింటి వేధింపులు భరించలేక అల్లుడు సూసైడ్.. సెల్పీ వీడియో కలకలం





