హైదరాబాద్: సికింద్రాబాద్ లోని తిరుమలగిరిలో ఘోరం జరిగింది. ఆర్మీ ట్రక్కు టైర్ కింద నలిగి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో విద్యార్థి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ఉదయం ఆర్మీ పబ్లిక్ స్కూల్ వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది.
తల్లితో స్కూటీ మీద స్కూల్ కు బయల్దేరాడు విద్యార్థి. అయితే ఆర్మీ పబ్లిక్ స్కూల్ గేట్ 2 వద్ద స్కూటీ స్కిడ్ అయ్యి తల్లీకొడుకులు కింద పడిపోయారు. ఆ వెనకాలే వస్తున్న ఆర్మీ ట్రక్కు టైర్ విద్యార్థి మీద ఎక్కేసింది. దీంతో అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన తల్లిని ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న తిరుమలగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆర్మీ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
Also read
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!
- జైల్లో ఉన్న భర్తను బెయిల్పై బయటకు తెచ్చిమరీ చంపిన భార్య.. అసలు కారణం తెలిస్తే
- బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్, కోల్కతాతో లింకులు బట్టబయలు..





