SGSTV NEWS
Andhra PradeshCrime

అల్లూరి జిల్లాలో విషాదం – జలపాతంలో ముగ్గురు ఎంబీబీఎస్‌ విద్యార్థులు గల్లంతు

అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చిన ముగ్గురు ఎంబీబీఎస్‌ విద్యార్థులు గల్లంతయ్యారు. ప్రమాదవశాత్తు ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోగా, స్థానికులు ఇద్దర్ని కాపాడారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలోని జలతరంగిణి జలపాతం వద్ద ప్రమాదం విషాదం చోటుచేసుకుంది. జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చిన ఎంబీబీఎస్‌ విద్యార్థులలో ముగ్గురు గల్లంతయ్యారు. ప్రమాదవశాత్తు జలపాతంలో ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోగా, స్థానికులు ఇద్దర్ని కాపాడారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిలో ఇద్దరు యువతులు, యువకుడు ఉన్నారు. మొత్తం 14 మంది వైద్య విద్యార్థులు ఏలూరు నుంచి విహార యాత్రకు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.

Also read

Related posts

Share this