October 16, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Crime News: వైఎస్సార్ జిల్లాలో హడలెత్తిస్తున్న దొంగలు.. గోల్డ్ షాపులో కిలో బంగారం చోరీ

వైఎస్సార్ జిల్లా ప్రజలను దొంగలు హడలెత్తిస్తున్నారు. శనివారం రాత్రి కడప, ఒంటిమిట్టలో జరిగిన ఆరు చోరీలు మరవకముందే ఆదివారం రాత్రి మరో భారీ చోరీ జరిగింది.

మైదుకూరు: వైఎస్సార్ జిల్లా ప్రజలను దొంగలు
హడలెత్తిస్తున్నారు. శనివారం రాత్రి కడప, ఒంటిమిట్ట, పులివెందులలో జరిగిన చోరీల ఘటన మరువకముందే ఆదివారం రాత్రి మరో భారీ చోరీ జరిగింది.

మైదుకూరులోని మిట్టా జ్యువెలరీ దుకాణంలో కిలో బంగారం, పెద్ద ఎత్తున వెండి వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. నగల దుకాణం వెనుక నుంచి రంధ్రం చేసి లోపలికి చొరబడ్డారు. దుకాణంలోని సీసీ కెమెరా హార్డ్ డిస్క్ ను పగులగొట్టి తీసుకెళ్లారు. రెండు రోజుల నుంచి దుకాణాన్ని యజమాని తెరవకపోవడాన్ని గుర్తించి చోరీకి పాల్పడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ నిపుణులు వివరాలు సేకరించారు.

శనివారం రాత్రి కడప, ఒంటిమిట్టలో.. ఆదివారం తెల్లవారుజామున పులివెందులలో భారీ చోరీలు జరిగాయి. పులివెందులలోని ఓ ఇంటిలో రూ.60 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులతో పాటు రూ. లక్ష నగదు చోరీచేశారు. ఒంటిమిట్ట, కడపలోని ద్వారకానగర్ ఏటీఎంలలో పెద్దమొత్తంలో నగదు దోచుకెళ్లారు. ఒంటిమిట్టలో రూ.36 లక్షలు, కడప నగరంలోని ద్వారకానగర్కు వెళ్లే దారిలోని ఏటీంఎంలో రూ. 6లక్షలు దోచుకెళ్లారు.

Also read

Related posts

Share via