SGSTV NEWS
Andhra PradeshCrime

Train Theft: చిత్తూరులో రెచ్చిపోయిన దొంగలు.. ట్రైన్‌ ఆపి మరీ…


ఏపీ లోని చిత్తూరు రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం అర్థరాత్రి దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ట్రైన్‌ ఆపి మరీ దొంగలు విరుచుకుపడ్డారు. బెంగళూరు వైపు వెళ్తున్న చామరాజు నగర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ 16219లో విద్యుత్తు సరఫరా ఆపేసి అందినకాడికి దోచుకున్నారు.

Train Theft: ఏపీ లోని చిత్తూరు రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం అర్థరాత్రి దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ట్రైన్‌ ఆపి మరీ దొంగలు విరుచుకుపడ్డారు.  బెంగళూరు వైపు వెళ్తున్న చామరాజు నగర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ 16219లో విద్యుత్తు సరఫరా ఆపేసి దొంగతనం చేశారు. రైలులో ప్రయాణిస్తున్న వారిని బయపెట్టి అందిన కాడికి దోచుకున్నారు. బీహార్ తరహాలో ట్రైన్ ఆపి మహిళల మెడలోని తాళిబొట్లు, చైన్లను బందీపోట్లు గుంజుకెళ్లారు. బుధవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్తూరు – కాట్పాడి రైల్వేమార్గం సిద్ధంపల్లి వద్ద నిన్న (బుధవారం) అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దోపిడీ జరిగింది

ఈ ఘటన చిత్తూరులో కలకలం సృష్టించింది. ఈ విషయమై బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంత పెద్ద ఘటన జరిగినప్పటికీ రైల్వే పోలీసులు ఈ ఘటనను బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు.ఈ ఘటనను రైల్వే పోలీసులు గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. రైలులో చోరీ జరుగుతున్న సమయంలో కొంతమంది రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించలేదన్న విమర్శలున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో చిత్తూరు రైల్వే స్టేషన్‌కు భారీగా పోలీసు బలగాలు చేరి విస్తృత తనిఖీలు నిర్వహించారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు

Also read

Related posts

Share this