March 12, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

చిత్తూరు కాల్పుల ఘటనలో బిగ్ ట్విస్ట్ – దోపిడీకి వ్యాపారి ప్లాన్ –


చిత్తూరు గాంధీరోడ్డులో దొంగల కాల్పుల ఘటనలో కీలక మలుపు – రబ్బర్ బుల్లెట్లు వినియోగించే తుపాకులతో చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి యత్నం

THIEVES FIRED GUNS IN CHITTOOR: చిత్తూరులో ఒక వ్యాపారి ఇంట్లో మరో వ్యాపారి సినీ ఫక్కీలో దోపిడీకి యత్నించిన ఘటన సంచలనం సృష్టించింది. రబ్బర్ బుల్లెట్లు వినియోగించే తుపాకులతో కాల్పులు జరపడం అలజడి రేపింది. సుమారు రెండున్నర గంటలపాటు దొంగలను పట్టుకునేందుకు పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌ తీవ్ర ఉత్కంఠ రేపింది. చివరికి పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

బుధవారం ఉదయం చిత్తూరులోని గాంధీరోడ్డులో ఒక్కసారిగా కాల్పుల కలకలం నెలకొంది. ఓ ఇంట్లోకి చొరబడిన దొంగల ముఠా రెండు తుపాకులతో కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2 తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. దుండగుల కోసం రెండున్నర గంటలపాటు పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు.

కాల్పుల ఘటనలో కీలక మలుపు: అనంతరం దొంగల కాల్పుల ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఓ ప్రముఖ వ్యాపారి ఇంట్లో దోపిడీకి మరో ప్రముఖ వ్యాపారి పన్నాగం పన్నినట్లు పోలీసులు గుర్తించారు. పుష్ప కిడ్స్‌ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి ఎస్‌ఎల్‌వీ ఫర్నీచర్ యజమాని ముఠాను ఏర్పాటు చేశారు. కర్ణాటక, ఉత్తరాదికి చెందిన దుండగులతో వ్యాపారి ముఠా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

రబ్బర్ బుల్లెట్లు వినియోగించే తుపాకులతో చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి యత్నించారు. పుష్ప కిడ్స్‌ వరల్డ్ యజమాని చంద్రశేఖర్‌ ఇంట్లోకి వెళ్లాక దుండగుల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పుష్ప కిడ్స్‌ వరల్డ్ యజమాని చంద్రశేఖర్‌కు గాయాలు అయ్యాయి. ఇంట్లో దుండగులు చొరబడటంతో అప్రమత్తమైన వ్యాపారి చంద్రశేఖర్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రెండున్నర గంటలపాటు పోలీసుల ఆపరేషన్: వ్యాపారి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే చిత్తూరులోని గాంధీరోడ్డు పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు, దుండగుల కోసం రెండున్నర గంటలపాటు ఆపరేషన్ నిర్వహించారు. రెండున్నర గంటల పాటు ఆపరేషన్ తర్వాత గాంధీరోడ్డులో సాధారణ పరిస్థితి తెచ్చారు. చోరీకి ముఠా ఏర్పాటు చేసిన ఎస్‌ఎల్‌వీ ఫర్నీచర్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share via