June 29, 2024
SGSTV NEWS
CrimeTelangana

కలిసి బతకలేమని కడతేరిపోయారు!



• ఒకే రోజు వేర్వేరు చోట్ల యువ దంపతుల ఆత్మహత్య

జీడిమెట్ల, జగద్గిరిగుట్ట: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. జీవితాంతం కలిసి ఉండాలని బాసచేసి పెళ్లి చేసుకున్నారు.. వీరి కాపురం కొన్నాళ్లు సాఫీగానే సాగింది. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఏం జరిగిందో ఏమో భార్య హెచ్ఎల్లోని తల్లి గారింట్లో, భర్త చింతల్ హెచ్ఎంటీలో ఒకేరోజు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

జీడిమెట్ల, జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గాజులరామారం హెచ్ఎఎల్ కాలనీకి చెందిన కృష్ణమూర్తి చిన్న  కుమారుడు మంచూరి రెశ్వంత్ (26), గాజులరామారం హెచ్ఎల్ కాలనీకి చెందిన సాయిశ్రేయ (22)ను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు.  అనంతరం గాజులరామారం ద్వారకా నగర్లో కాపురం పెట్టారు.  రెశ్వంత్ బిగ్బాస్కెట్లో డెలివరీ బాయ్స్ పని చేస్తున్నాడు.  కొన్నాళ్లు దంపతులిద్దరూ బాగానే ఉన్నారు. ఇటీవల ఇద్దరి మధ్య  గొడవలు ప్రారంభమయ్యాయి. శనివారం రెశ్వంత్ హెచ్ఎంటీ నిర్మానుష్య ప్రదేశంలో చెట్టుకు చున్నీతో ఉరి వేసుకుని మృతిచెందాడు. సాయిశ్రేయ హెచ్ఎల్ కాలనీలోని తల్లిగారింట్లో ఉరి వేసుకుని మృతిచెందింది. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share via