శుక్రగ్రహానికి ఉండే ప్రాధాన్యత ప్రాముఖ్యత గురించి చెప్పాల్సిన పని లేదు. శుక్రుడు సంపద, ఆనందం, శ్రేయస్సుకు చిహ్నం. శుక్రుడి అనుగ్రహం ఏ రాశుల వారిపై ఉంటే వారి పంట పండినట్లే అంటారు పండితులు. అయితే శుక్రుడు కొన్ని రాశులపై తన అనుగ్రహాన్ని చూపుతున్నాడంట. దీని వలన నాలుగు రాశుల వారికి అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. మరి ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?
శుక్ర గ్రహం అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లే అంటారు. శుక్రుడు వరాలు కురిపిస్తాడు, సంపదను రెట్టింపు చేస్తాడు. అయితే గ్రహాలకు కొన్ని రాశులంటే ఎప్పుడూ చాలా ఇష్టం ఉంటుంది. అదే విధంగా శుక్ర గ్రహానికి కూడా నాలుగు రాశులంటే చాలా ప్రీతికరం అంట. అందువలన ఆ రాశుల వారికి ఎల్లప్పుడూ శుక్రుడి అనుగ్రహం ఉండటమే కాకుండా, వారికి అన్ని విధాల అదృష్టం కలిసి వస్తుందంట. మరి శుక్రగ్రహం ఫేవరెట్ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
కుంభ రాశి : కుంభ రాశి అంటే శుక్ర గ్రహానికి చాలా ప్రీతికరం. అందువలన శుక్రుడు ఎల్లప్పుడూ ఈ రాశివారిపై తన అనుగ్రహాన్ని చూపిస్తాడంట. అందువలన ఈ రాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా, వ్యాపార పరంగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయంట. ముఖ్యంగా వీరికి ఉన్న అప్పుల సమస్యలన్నీ తొలిగిపోయి, ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటారని చెబుతున్నారు పండితులు.
తుల రాశి : తులా రాశి వారికి శుక్రుడు ఎల్లప్పుడూ అధిపతిగా ఉంటాడు. అందువలన ఈ రాశి వారికి కూడా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయంట. వీరు అనుకున్న పనులను త్వరగా పూర్తి చేస్తారు. విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదిస్తారు. వైవాహిక బంధం అద్భుతంగా సాగిపోతుంది.
మీన రాశి : మీన రాశి వారిపై శుక్రుడి చల్లని చూపు ఉంటుంది. అందువలన ఈ రాశి వారు శుక్రగ్రహం అనుగ్రహంతో చాలా ఆనందంగా, విలాసవంతంగా గడుపుతారు. అంతే కాకుండా వీరు స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. అనుకున్న పనుల్లో అద్భుతమైన ప్రయోజనాలు అందుకుంటారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు.
వృషభ రాశి : వృషభ రాశి శుక్రుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అందువలన వీరికి ఎక్కువగా సంపాదించాలనే భారీ కోరికలు ఉంటాయి. వాటిని వీరు నెరవేర్చుకునే అవకాశం ఎక్కువ ఉన్నదంట. అలాగే శుక్రుడి అనుగ్రహం ఉన్న సమయంలో ఈ రాశుల వారు అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి చేస్తారంట. విద్య, వ్యాపార రంగంలో మొదటి స్థానంలో నిలుస్తారు
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!