Pinnelli Ramakrishna Reddy: మాచర్ల నియోజక వర్గంలో హై అలర్ట్ నెలకొంది. పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం అందుతోంది. పిన్నెల్లి నీ అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ చేరుకున్నారట పోలీసులు. పాల్వయి గ్రామం లో పోలింగ్ బూత్ లో ఈవీఎం ధ్వంసం చేయడాన్ని సీరియస్ గా తీసుకుంది ఎన్నికల సంఘం.
దీంతో పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీకి ఆదేశాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బృందాలుగా వీడి పోయి పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కోసం గాలిస్తున్నారట ఏపీ పోలీసులు. పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని ఏ క్షణం అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ విషయాన్ని ఈసీ చాలా తీవ్రంగా పరిగణిస్తూ, ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి తెలియజేయాలని సీఈవో ముఖేష్ కుమార్ మీనా ను ఆదేశించింది. తద్వారా ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో భవిష్యత్తులో ఎవరూ ఇటువంటి దుశ్చర్యలకు సాహసం చేయరని ఈసీ భావిస్తున్నది.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్గా చేస్తే సూపర్ ఇన్కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!