April 16, 2025
SGSTV NEWS
CrimeNational

ఆఫీసులో పార్టీ ఉంది.. రాత్రి ఇంటికి రాను అని చెప్పిన మాయా

బనశంకరి: ప్రేమ- ద్రోహం గొడవలతో ప్లాన్ ప్రకారమే ప్రియురాలిని ప్రియుడు హత్య చేసినట్లు అసోం యువతి మాయా గొగోయ్ కేసులో పోలీసులు నిర్ధారించారు. బెంగళూరు ఇందిరానగరలో ఓ సర్వీసు అపార్టుమెంటు ఫ్లాటులో మాయా అనే ప్రైవేటు ఉద్యోగిని హత్యకు గురికావడం తెలిసిందే.

స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు ఆరవ్ ఆర్ని రెండు రోజులు శవం వద్దే గడిపాడు. ఆమెను చంపడం కోసం చాకును తీసుకెళ్లాడు. ఆన్లైన్లో నైలాన్ తాడు కొనుగోలు చేశాడు. ముందుగా తాడుతో మాయాకు గొంతుకు బిగించి హత్యచేసినట్లు కనబడింది. తరువాత కత్తితో పొడిచాడు. మంగళవారం ఉదయం 8.30 సమయంలో అతడు రూంని ఖాళీ చేశాడు. కేరళకు పారిపోయాడని భావిస్తున్నారు.

పోలీసులు కేరళ, మహారాష్ట్రకు వెళ్లారు. నగరంలనూ గాలిస్తున్నారు. ఆరవ్ స్వస్థలం కేరళ కాగా, సోషల్ మీడియా ద్వారా పరిచయమైంది. ఆరేళ్ల నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. మాయా సోదరి కూడా బెంగళూరులోనే ఉంటుంది. సోదరికి శుక్రవారం కాల్ చేసి, ఆఫీసులో పార్టీ ఉంది, రాత్రి ఇంటికి రాను అని చెప్పిన మాయా, మళ్లీ శనివారం ఒకసారి మెసేజ్ పంపింది. ఆ తరువాత కాంటాక్టులో లేదు.

Also read

Related posts

Share via