• రూ.18,41,300 నగదు అపహరణ
కూడేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం సెంటర్ లో
శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటన అనంతపురం జిల్లా, కూడేరు మండలంలో చోటుచేసుకుంది. ఏటీఎంను పగులగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు, అందులోని రూ.18,41,300 నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… కూడేరులో దళితవాడకు ఎదురుగా అనంతపురం – బళ్లారి ప్రధాన రహదారి పక్కన అనంతపురం సాయినగర్ లోని స్టేట్ బ్యాంకు ప్రధాన శాఖ ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేశారు.
శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కట్టర్తో ఏటీఎంను కట్ చేశారు. మిషన్లో ఉంచిన నగదు చోరీ చేశారు. అదే సమయంలో మిషన్లో షార్ట్ సర్క్యూట్ సంభవించి పైభాగం కాలిపోయింది. శబ్దం కూడా రావడంతో స్థానికుడొకరు బయటకు వచ్చి చూడగా.. ఏటీఎం సెంటర్ నుంచి కొందరు కార్లో వెళ్లిపోవడం, సెంటర్లో నుంచి పొగ రావడం గమనించాడు.
కొంత సమయం తర్వాత విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. సీఐ శివరాముడు ఏటీఎం సెంటరును పరిశీలించారు. చోరీ జరిగిందని నిర్ధారించుకుని సమాచారాన్ని బ్యాంకు అధికారులకు అందించారు. సంబంధిత అధికారులు వచ్చి పరిశీలించారు. నగదు నిల్వ, విత్య్రాలకు సంబంధించి ప్రధాన కార్యాలయం నుంచి డేటా తీసుకున్నారు. రూ.18,41,300 చోరీకి గురైనట్టు పోలీసులకు తెలిపారు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!