హైదరాబాద్‌లోని ఓల్డ్ మలక్‌పేటలో కుటుంబ తగాదాలతో అక్కను తమ్ముడు చంపాడు. లక్ష్మిని ఆమె సోదరుడు మదన్‌బాబు కత్తితో దాడి చేసి చంపి అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఆస్తుల తగాదాలు ఈ మధ్య కాలంలో ఎక్కువై పోతున్నాయి. ఇటీవల కాలంలో కన్నతల్లిదండ్రులతోపాటు తోబుట్టువులపై దాడులకు పాల్పడుతున్నారు. ఇస్తే ఆస్తి అయినా ఇవ్వు..? లేదా ప్రాణాలైనా ఇవ్వు అన్నట్టు క్షణికావేశంలో దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది. స్థానిక వివరాల ప్రకారం
ఆస్తి కోసం..
హైదరాబాద్‌లోని ఓల్డ్ మలక్‌పేటలో కుటుంబ తగాదాలతో అక్కను తమ్ముడు చంపాడు. పాత మలక్‌పేటలో నివాసం ఉంటున్న లక్ష్మిని ఆమె సోదరుడు మదన్‌బాబు కత్తితో దాడి చేసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న లక్ష్మిని చూసి చుట్టు పక్కన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై స్థానికులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ కలహాలతోనే లక్షిని చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025