సారంగాపూర్: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన ఎదురుగట్ల సతీశ్ (29) అదే కాలనీకి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానని, ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఎవరూ రావొద్దని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఈ విషయంపై యువతి కుటుంబ సభ్యులు సతీశ్ను పలుమార్లు వారించారు. అయినా అతడిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో శనివారం రాత్రి 8గంటలకు సతీశకు, యువతి కుటుంబ సభ్యులకు గొడవ జరిగింది. యువతి కుటుంబ సభ్యులు కర్రలతో సతీష్పై దాడి చేయగా, మృతిచెందాడు.
Also read
- వైష్ణవి ఎంత కొట్టినా తలుపు తెరవలేదు.. అనుమానమొచ్చి కిటికీలో నుంచి చూడగా..
- పట్టపగలు రెచ్చిపోయిన దొంగలు.. రెప్పపాటులో స్కూటీ డిక్కీలో రూ.8 లక్షలు మాయం..!
- నడిరోడ్డుపై బైక్పై విన్యాసాలు వద్దన్న పాపానికి.. వాహనదారులపై రెచ్చిపోయిన పోకిరిలు..!
- Ugadi Rasi Phalalu: పరాభవనామ సంవత్సరంలో పన్నెండు రాశుల ఆదాయం, వ్యయంతో పాటు అదృష్ట సంఖ్యలు, రోజులు వివరాలు!
- Lifestyle: రాత్రి నిద్ర పట్టడం లేదా? ఈ ఒక్క మంత్రం చదివితే చాలు గాఢ నిద్రలోకి.. అద్భుతమైన ఫార్మూలా!





