June 29, 2024
SGSTV NEWS
CrimeUttar Pradesh

అత్యాచారం చేశాడని ఫేక్ కేసు పెట్టిన మహిళ.. తర్వాత ఏమైందంటే?



తన కుమారై పై అత్యాచారం చేశాడంటూ  ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు విషయం బయటపడటంతో నిర్దోషిగా విడుదలయ్యాడు. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..తప్పుడు అత్యాచారం కేసు పెట్టిన ఓ మహిళకు కోర్టు జైలు శిక్షతో పాటు రూ.5.88 లక్షల జరిమానా విధించింది. యూపీకి చెందిన మహిళ తన కూతురి పై ఓ యువకుడు అత్యాచారం చేశాడని 2019లో ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం జరిగిందని ఆమె కూతురు కూడా వాంగ్మూలం ఇచ్చింది. కేసు పెండింగ్లో ఉండగా, నిందితుడు 4ఏళ్లు జైల్లో ఉన్నాడు. ఈ సందర్భంగా విచారణలో భాగంగా తాజాగా ఆ బాలిక తన వాంగ్మూలం తప్పని కోర్టులో అంగీకరించింది. దీంతో అదనపు సెషన్స్ న్యాయస్థానం అజయ్్న నిర్దోషిగా ప్రకటించింది. తప్పుడు కేసు పెట్టినందుకు బాలిక తల్లికి 340 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది

Also read

Related posts

Share via