July 3, 2024
SGSTV NEWS
CrimeUttar Pradesh

Wall Collapses: ఇంటి గోడ కూలి.. ముగ్గురు చిన్నారులు మృతి, మరో ఐదుగురికి గాయాలు

ఓ నిర్మాణంలో ఉన్న ఇంటి సమీపంలో కొంత మంది పిల్లలు కలిసి శుక్రవారం రాత్రి 7. 30 గంటల ప్రాంతంలో ఆడుకుంటున్నారు. అదే సమయంలో ఆకస్మాత్తుగా గోడ కూలింది. దీంతో అక్కడున్న చిన్నారుల్లో ముగ్గురు మృత్యువాత చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.

ఓ నిర్మాణంలో ఉన్న ఇంటి సమీపంలో కొంత మంది పిల్లలు కలిసి శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఆడుకుంటున్నారు. అదే సమయంలో ఆకస్మాత్తుగా గోడ కూలింది. దీంతో అక్కడున్న చిన్నారుల్లో ముగ్గురు మృత్యువాత చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. వెంటనే గమనించిన స్థానికులు అప్రమత్తమై వారిని శిథిలాల నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్ సూరజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖోడ్నా గ్రామంలో చోటుచేసుకుంది.

రెండో అంతస్తు

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, చనిపోయిన ముగ్గురు పిల్లల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఖోడ్నాలో సగీర్‌కు చెందిన నిర్మాణంలో ఉన్న రెండో అంతస్తు పైకప్పు, గోడ రాత్రి ఆకస్మాత్తుగా కూలిపోయాయని సెంట్రల్ నోయిడా అదనపు డీసీపీ తెలిపారు. శిథిలాల కింద సగీర్ సొంత కుటుంబం, అతని బంధువుల 8 మంది పిల్లలు ఉన్నారని చెప్పారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లిన క్రమంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందగా, మిగిలిన ఐదుగురు చికిత్స పొందుతున్నారని అన్నారు.
Also read :నడిరోడ్లపై సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్.. పోలీసుల అదుపులో ముఠా..

కేసు నమోదు

ప్రమాదంలోఅహద్, అల్ఫీజా, ఆదిల్ మరణించగా, గాయపడిన చిన్నారుల్లో ఆయేషా (16), హుస్సేన్ (5), సోహ్నా (12), వాసిల్ (11), సమీర్ (15) ఉన్నారు. ఈ ప్రాంతంలో కొన్ని గంటల క్రితం వర్షం కురిసింది. ఈ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. క్షతగాత్రులందరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Also read :మదర్సాలో బాలిక అనుమానాస్పద మృతి

Related posts

Share via