కుమారుడు క్షణికావేశంలో తల్లిని కొట్టడంతో మృతి చెందిన సంఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పులలో శనివారం చోటు చేసుకుంది.
శాయంపేట, : కుమారుడు క్షణికావేశంలో తల్లిని కొట్టడంతో మృతి చెందిన సంఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పులలో శనివారం చోటు చేసుకుంది. సీఐ రంజిర్రావు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మోతె తిరుపతిరెడ్డి శనివారం తన ఇంటి పక్కనున్న చింత చెట్టు విషయంలో పక్కింటి వారితో గొడవ పడ్డాడు. భార్య నాగరాణి ఆయనను వారించి ఇంట్లోకి తీసుకెళ్లారు. దీంతో తిరుపతిరెడ్డి భార్యను కొడుతుండగా ఆయన తల్లి అమృతమ్మ(85) అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తిరుపతిరెడ్డి పక్కనే ఉన్న మంచం పట్టెతో తల్లిని కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. ఆదివారం ఉదయం సీఐ సంఘటన స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఎస్సై ప్రమోద్ కుమార్ గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేశారు. మృతురాలి కుమార్తె రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025