April 19, 2025
SGSTV NEWS
Telangana

డెంగ్యూ వ్యాధితో ప్రజల ప్రాణాలు పోతున్న ఎస్.డి.పి మిషన్ ను ప్రారంభించడం లేదు..

*
*లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఎస్ డి పి మిషన్ వృధాగా సంవత్సరం నుండి కామారెడ్డి ప్రభుత్వ వైద్యశాలలో…*

*టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు….*



కామారెడ్డి జిల్లా బ్యూరో ఆగస్టు 21 : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ వైద్యశాలలో సంవత్సర కాలం క్రితం డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారిని కాపాడాలని ఉద్దేశంతో సుమారుగా 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి సింగిల్ డోనర్ ప్లేట్ లెట్స్ (ఎస్.డీ.పీ) మిషన్ ను తీసుకురావడం జరిగింది కానీ ఇప్పటివరకు ఆ మిషన్ కు కావలసిన అనుమతులను తీసుకు రావడంలో,వైద్య అధికారుల నిర్లక్ష్యం వలన పేదల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు ఆరోపించారు.జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ఇప్పటికే డెంగ్యూ వ్యాధితో ప్రాణాలను కోల్పోవడం జరిగిందని.వెంటనే జిల్లా కలెక్టర్ సంబంధిత వైద్య అధికారులు స్పందించి ఈ మిషన్ ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

Also read

Related posts

Share via