సమిశ్ర గూడెం, నిడదవోలు
ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యు) గుంటూరులో మే 23 24 తేదీలలో జరిగే 9వ రాష్ట్ర మహాసభల పోస్టర్ ను సమిశ్ర గూడెం లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రగతిశీల మహిళా సంఘం( పిఓ డబ్ల్యు) జిల్లా సహాయ కార్యదర్శి ఈమని మల్లిక మాట్లాడుతూ దేశంలో బాలికలపై జరుగుతున్న లైంగిక హింస నిరోధించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. మహిళలు జీవించే హక్కుల కోసం, మహిళల స్వేచ్ఛ స్వతంత్రాల కోసం, మహిళా సమస్యల పరిష్కరించాలని జరిగేటటువంటి గుంటూరు మహాసభల్లో మహిళ లోకం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ మహిళలకు రక్షణ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు వేసవి కాలంలో మజ్జిగ మంచినీళ్లు అల్పాహారం ఉపాధి హామీ కూలీలకు అందించాలని ఆమె డిమాండ్ చేశారు ఉపాధి హామీ కూలీలు వేసవికాలంలో వారి దెబ్బకు గురవుతున్నారని వడదెబ్బకు గురైన కూలీలందరికీ ప్రత్యేక అలవెన్స్ ను మంజూరు చేయాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ కూలి సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం రవీంద్ర మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు రోజు కూలి 1000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీలు కూలీలు కి 20 లక్షల రూపాయలు ఉచిత ఇన్సూరెన్స్ చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో IFTU ఉపాధి హామీ కూలి సంఘం కమిటీ ప్రధాన కార్యదర్శి గడ్డం రవీంద్ర బాబు అధ్యక్షురాలు రాచర్ల సువర్ణ రత్నం, ముప్పిడి లక్ష్మి, మిరియాల మేరీ,కోడమంచిలి లక్ష్మి, చిన్నం ఝాన్సీ, పడమట గాలివు, బుర్ర శ్రీను, సత్య, ఆరుద్ర తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
రాచర్ల సువర్ణ రత్నం, అధ్యక్షులు
గెడ్డం రవీంద్రబాబు ప్రధాన కార్యదర్శి
ఉపాధి హామీ కూలి సంఘం IFTU
సమిశ్ర గూడెం, నిడదవోలు మండలం
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





