నరసాపురంలో పోలీసు వ్యవస్థ చాలా ఘోరంగా తయారైందని రాష్ట్ర పల్లవసేన అధ్యక్షుడు కొల్లాటి బాబురావు మండిపడ్డారు.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నరసాపురం పట్టణ పరిధిలోని చిన్న మామిడిపల్లి లో ఒక స్థల విషయంలో కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డరని ఫిర్యాదు చేస్తే బాధితులను బెదిరించిన వ్యక్తి వద్ద లంచాలు తీసుకుని పోలీసులు తిరిగి బాధితులను భయపెట్టడం అత్యంత దారుణమని నరసాపురంలో పోలీసు వ్యవస్థ వల్ల వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అన్నారు. స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లన్నీ ఉన్నప్పటికీ ఒక వ్యక్తి కడప నుండి వచ్చి ఈ స్థలంలో సెల్ఫీ దిగాను ఈ స్థలం నాది అంటే పోలీస్ వ్యవస్థ మొత్తం ఆ వ్యక్తి కోసం పనిచేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థలో సామాన్యులకు న్యాయం జరగడం లేదని లంచాలు ఇచ్చి నేరస్తులు తప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఒక మహిళను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోమని ఫిర్యాదు చేస్తే పోలీస్ అధికారులు కనీసం పట్టించుకోకుండా నిందితులకు వత్తాసు పలకడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సమస్య చెప్పేందుకు 100కు డయల్ చేసి చెప్పిన స్పందన కరువైందన్నారు. ఏసీబీ అధికారులు దాడులు చేసి అవినీతి అధికారులను పట్టుకుంటున్న పోలీసు అధికారులు ఎటువంటి భయం లేకుండా లంచాల కోసమే పని చేస్తున్నారని విమర్శించారు. ఆ స్థలం విషయంలో ఫిర్యాదు చేసిన బాధ్యత మహిళకు న్యాయం చేయాలని లేని పక్షంలో ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు.దీనికి ప్రధాన కారకుడు అయినా చీఫ్ ఇంజనీర్ నారాయణరావు పై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్ను కౌన్సిలింగ్కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





