April 15, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

పోలీసులు చెప్పినా వినలేదు.. ప్రేమ పెళ్లి చేసుకున్న యువతిని దారుణంగా చంపిన ఫ్యామిలీ!


ఏపీలో మరో పరువు హత్య జరిగింది. చిత్తూరు జిల్లా మసీదు మిట్టలో ప్రేమించి పెళ్లిచేసుకున్న యాస్మిన్ భానును తన ఫ్యామిలీ నమ్మించి హతమార్చింది. తండ్రికి ఆరోగ్యం బాగోలేదని ఇంటికి పిలిచి చంపేసింది. భాను భర్త సాయి తేజ్ ఆమె కుంటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

AP Crime: ఏపీలో మరో పరువు హత్య జరిగింది. చిత్తూరు జిల్లాలో  ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని తన ఫ్యామిలీ నమ్మించి హతమార్చింది. ఈ మేరకు మసీదు మిట్టకు చెందిన యాస్మిన్ భాను పూతలపట్టు మండలంకు చెందిన సాయి తేజ్ ను మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. నాలుగు సంవత్సరాలుగా వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుండగా.. ఫిబ్రవరి 9న నెల్లూరులో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తమకు రక్షణ కావాలంటూ ఫిబ్రవరి 13న  తిరుపతి ముత్యాల రెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. దీంతో యాస్మిన్ భాను తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

తండ్రికి బాగోలేదని పిలిచి..
అయితే యాస్మిన్ భానుతో ఫోన్లో టచ్ లోనే ఉంటున్నారు తల్లిదండ్రులు. ఈ క్రమంలోనే తన తండ్రికి ఆరోగ్యం సరిగా లేదని, ఇంటికి పంపించాలని సాయి తేజ్‌ను కోరారు. దీంతో ఆదివారం ఉదయం 11 గంటలకు యాస్మిన్ భానును కారులో చిత్తూరుకు తీసుకొచ్చాడు భర్త సాయి తేజ్. అక్కడినుంచి యాస్మిన్ భానును కారులో తీసుకెళ్లారు ఆమె సోదరుడు. ఈ క్రమంలోనే తన ఇంట్లో యాస్మిన్ భాను చనిపోవడం సంచలనం రేపింది.

ఆమె మరణానికి కారణం వారి తల్లిదండ్రులే అంటూ సాయి ఆరోపిస్తున్నాడు. ఆమెను తీసుకెళ్లి హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించిన చిత్తూరు టు టౌన్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Also read

Related posts

Share via