Lబనశంకరి: తన ఇద్దరు పిల్లలను హత్యచేసిన కేసులో పరప్పన అగ్రహార జైలులో రిమాండ్‌లో ఉన్న తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. గంగాదేవి అనే మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి జాలహళ్లిలో నివాసం ఉంటోంది. గంగాదేవి ప్రైవేటు కంపెనీలో, భర్త బీబీఎంపీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గంగాదేవి మంగళవారం రాత్రి కుమార్తె లక్ష్మీ(7), గౌతమ్‌ను ఈనెల 9న దిండుతో ఊపిరా ఆడకుండా చేసి చంపేసింది. అనంతరం సహాయవాణికి ఫోన్ చేసి ఇక్కడ గొడవ జరుగుతున్నట్లు తెలిపింది. పోలీసులు రాగా అసలు విషయం చెప్పింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పరప్పన అగ్రహరజైలుకు తరలించారు. ఆదే రోజు రాత్రి జైలులో ఆత్మహత్యకు పాల్పడింది. డాక్టర్లు మృతదేహానికి పంచనామా చేపట్టిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈఘటనపై పరప్పనఅగ్రహార పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!