కాకినాడ జిల్లా ఎస్ అచ్యుతాపురంలో ఓ కొడుకు తల్లిని చంపేశాడు. ఉద్యోగం చేయాలని మందలించడమే ఆ తల్లి తప్పయింది. క్షణికావేశంలో తల్లిని నుదుటిపై గుద్దడంతో ఆమె అక్కడిక్కడే చనిపోయింది. ఇంద్రపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు.. మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు… మనిషిలో మానవత్వం కనుమరుగవుతోందని ఓ కవి వ్యక్తం చేసిన ఆవేదన ఇది. మానవ సంబంధాలకు మచ్చ తెచ్చేలా ఏకంగా కన్నతల్లినే కడతేర్చాడు ఓ కిరాతకుడు..చిన్నకారణంతో తల్లిని చంపడంతో విషాదం నెలకొంది.
కాకినాడ జిల్లా ఎస్ అచ్యుతాపురంలో ఓ కొడుకు తల్లిని చంపేశాడు. ఉద్యోగం చేయాలని మందలించడమే ఆ తల్లి తప్పయింది. క్షణికావేశంలో తల్లిని నుదుటిపై గుద్దడంతో ఆమె అక్కడిక్కడే చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అచ్యుతాపురానికి చెందిన షేక్ జహీరా కుమారుడు షబీర్ బీటెక్ మధ్యలోనే మానేసి ఖాళీగా ఉంటున్నాడు. గత కొంతకాలంగా డిప్రెషన్‌కు గురికావడంతో అతనికి చికిత్స అందిస్తున్నారు.
ఈ క్రమంలో ఇంటి దగ్గర ఖాళీ గా ఉంటున్నావు ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని తల్లి మందలించింది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన షబీర్ పిడికిలితో తల్లి నుదుటిపై గుద్దాడు. అయితే ఆ దెబ్బ చెవి పై భాగాన కణితపై తగలడం తో తల్లి షేక్ జహీర్ బీబీ ఒక్క సారిగా కుప్పకూలి మృతిచెందింది.ఇంద్రపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- ఈ జన్మలో మీ బాధలకు గత జన్మలోని పాపాలే కాదు.. మరో కారణం ఉంది తెలుసా?
- Jaya Ekadashi: జయ ఏకాదశి ఉపవాసం ఉంటున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి
- Rathasaptami 2026: రథసప్తమి నాడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఎలా?.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..
- Weekly Horoscope: వారికి ఆర్థికంగా అదృష్టం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు
- వృద్ధాప్యంలో తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి! ఎక్కడంటే..





