నిడమర్రు (పశ్చిమ గోదావరి): నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామంలో యువకుడి హత్య కలకలం రేపింది. గ్రామానికి చెందిన యువకుడు మజ్జి ఏసు(26)ను శనివారం రాత్రి అత్యంత దారుణంగా హత్య చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏసు తండ్రి ప్రసాద్ మరణించగా, తల్లి దుబాయ్ ఉంది. ఏసు దుర్గా శ్రీవల్లిని 2023లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఉండి మండలం కలిగొట్ల గ్రామంలోని ఆక్వా చెరువుల కాపలాదారుడిగా పని చేస్తున్నాడు.
భార్య 8వ నెల గర్భవతి కావడంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. మృతుడితోపాటు అమ్మమ్మ మాత్రమే ఉంది. శనివారం అర్ధరాత్రి దాటాక బావాయిపాలెం శివారులో ఉన్న చినకాపవరం పంటకాల్వ వద్ద ఏసును చంపి, శవాన్ని కాలువ రేవు వద్ద పడేశారు. అతని కుడి చేయిని నరికి తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం సమాచారం అందిన వెంటనే నిడమర్రు సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై వీర ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
భార్య శ్రీవల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ శ్రావణ్ కుమార్ కూడా క్లూస్ టీమ్ తో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హంతకులు ఒకరి కన్నా ఎక్కువ మంది ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడి ఇంటి పరిసరాల్లోనే డాగ్ స్క్వాడ్ కలియ తిరిగింది.
Also read
- Maha Shivaratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి..? పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
- Maha Shivaratri: మహాశివరాత్రి రోజున ఈ పూజ చేసేవాళ్లకు శివుడి ప్రత్యేక ఆశీర్వాదం..! ఆ శివుడు మీ జీవితాన్నే మార్చేస్తాడు..!
- Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
- Atrocious : జగిత్యాలలో దారుణం … ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు
- POCSO case : సిద్ధిపేటలో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు