July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

ప్రజా రంజకమైన పరిపాలన అందించడమే లక్ష్యంగా జగనన్న వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది….రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ తానేటి వనిత

గోపాలపురం,
తేది : 28.04.2024.

*గోపాలపురం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ తానేటి వనిత ప్రెస్ మీట్ పాయింట్స్…*

– ప్రజా రంజకమైన పరిపాలన అందించడమే లక్ష్యంగా జగనన్న వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది.

– శనివారం నాడు జగనన్న విడుదల చేసిన మేనిఫెస్టోని ప్రజలందరూ హర్షిస్తున్నారు..

– గత 5 ఏళ్లలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత జగనన్నకే దక్కుతుంది.

– జగనన్న చెప్పాడంటే చేస్తాడు అంతే అనే నమ్మకం ప్రజల్లో కలిగించారు..

– ప్రజలకు సుపరిపాలన అందించడంతో జగనే మా నమ్మకం అనే నినాదం ప్రజల్లో నుంచి పుట్టింది.

– జగనన్న అమలు చేసిన పథకాలనే ప్రతిపక్ష నేతలు కూటమి కాఫీ కొట్టింది.. జగనన్న పథకాలనే కాపీ కొట్టి సూపర్ సిక్స్ అంటున్నారు..

– పిల్లలందరికీ అత్యుత్తమ బోధనా పద్ధతులతో నాణ్యమైన విద్యను అందించాలని, బాల కార్మిక వ్యవస్థన నిర్మూలించే విధంగా జగనన్న అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చారు.

– అమ్మ ఒడి పథకానికి 15 వేల నుండి 17వేలకు పెంచారు.

– పెన్షన్ ను 3,000 నుండి 3,500 రూపాయలకు పెంచుతున్నాం..

– రైతు భరోసా కింద 13,500 నుండి 16,000 రూపాయలకు పెంచాం..

– వైయస్సార్ చేయూత, వైయస్సార్ కాపు నేస్తం, వైయస్సార్ ఈబీసీ నేస్తం పథకాలను కొనసాగిస్తూ ఆ పథకాల ద్వారా రెట్టింపు లబ్ధి అందేలా రూపొందించారు.

– మహిళా సాధికారికకు పెద్దపీట వేశారు.

– విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా మేనిఫెస్టోను తీర్చిదిద్దారు.

– ప్రజలందరూ జగనన్నకు తోడుగా అండగా నేను సైతం అని ముందుకొస్తున్నారు. జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు.

Also read

Related posts

Share via