రంగారెడ్డి: మరో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన భర్త.. భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం నోములలో జరిగింది. భార్య నిద్రిస్తున్న సమయంలో భర్త ఈ ఘాతకానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. అమృత, బాబులు.. భార్యా భర్తలు. అయితే మద్యానికి బానిసైన భర్త బాబు.. పదే పదే భార్య అమృతను వేధింపులకు గురి చేస్తున్నాడు. తాగొచ్చి తీవ్రంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య తరుచు గొడవలు జరుగుతూ ఉండేవి. కాగా, అమృత నిద్రిస్తున్న సమయంలో ఆమెను గొడ్డలితో నరికి హత్య చేశాడు. భార్యను హత్య చేసిన అనంతరం భర్త బాబు పరారయ్యాడు. ప్రస్తుతం నిందితుడు బాబు కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది.
Also read
- Holi 2026: ఆ ఊరి ప్రజలు రంగులతో కాదు.. స్మశానంలోని చితాభస్మంతో హోలీ ఆడతారు!
- Holi Festival 2026: హోళీ పండుగ ఎందుకు జరుపుకుంటారు..? పండుగ ప్రత్యేకత ఏంటి..?
- నేటి జాతకములు 26 ఫిబ్రవరి, 2026
- మాధవి ఆ సమయంలో ఎవరితో మాట్లాడింది.. రాత్రి ఇంటికి వెళ్లిన తర్వాత..
- తాతా.. అమ్మ ఉరి వేసుకుంది





