నిజాంపేట్: వంట రుచిగా చేయలేదని ఓ వ్యక్తి భార్యతో గొడవపడి ఆమెను హతమార్చిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నవీన్ దుర్వే, రవీనా దుర్వే(28) నగరానికి వలస వచ్చి బాచుపల్లిలోని వెనుక ఉన్న ప్రగతి కాన్స్టరెక్టన్ లో కార్మికులుగా పనిచేస్తూ గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం.సోమవారం రాత్రి వంట విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. వంట సరిగా చేయడం లేదని ఆగ్రహానికి లోనైన నవీన్ ఇటుకతో భార్య రవీనా తలపై మోదడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు నవీన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025