July 3, 2024
SGSTV NEWS
CrimeNational

భార్యని ఆ పని చేయమని భర్త బలవంతం! డబ్బు కోసం ఇంత నీచమా?


పెళ్లై పట్టుమని ఆరు, ఏడు ఏళ్లు కూడా కాలేదు. ఏం ఆనందం చూడలేదు. భర్తే సర్వస్వం అనుకుంది. అత్తిల్లే దైవాలయం అని భావించింది. కానీ వారు మాత్రం కోడలు దేవత అనుకోలేదు.

ఆడపిల్ల పుడితే.. అత్తవారింటికి వెళ్లాల్సిందేనని ఏ సమయంలో ఫిక్స్ చేశారో కానీ.. పుట్టిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర ఉండేది తక్కువ. అత్తారింట్లో గడిపేది ఎక్కువ. తాళి కట్టనంత వరకు పుట్టిల్లే ఆమె ఇల్లు. పెళ్లి తర్వాత అన్ని మారిపోతుంటాయి. ఇంటి పేరు మారిపోవడంతో పాటు.. భర్త పేరు వెనుకొచ్చి చేరుతుంది. ఇక తన కట్టుబొట్టు, నడక, నడత అన్నీ మారిపోతాయి. ముఖ్యంగా కొన్నింటిలో కాంప్రమైజ్ అయ్యి బతుకుతూ ఉంటుంది. ఆమెకంటూ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఉండదు. భర్త, అత్తమామలు చెప్పినట్లు చెయ్యాల్సిందే. అత్తింటి వారు అడిగినప్పుడల్లా పుట్టింటికి వెళ్లి డబ్బులు తీసుకురావాల్సిందే. కాదంటే కన్నెర చేస్తారు. తీసుకురాను అంటే.. ఎంతకైనా తెగించేందుకు వెనుకాడరు మానవ రూపంలో ఉన్న డబ్బు పిశాచాలు.


పెళ్లై.. పట్టుమని నాలుగేళ్లు కూడా కాలేదు.. ఏం కష్టమొచ్చిందో ఈ మహిళకు కానరాని లోకాలకు తరలివెళ్లిపోయింది. అత్తారింట్లో ఓ మహిళా అనుమానాస్పద రీతిలో మరణించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 2018 మే 12న జఫర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిగరువా గ్రామంలో నివసిస్తున్న సునీల్‌తో పూనమ్ దేవికి పెళ్లైంది. ఈ దంపతులకు అనికేష్ అనే నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. పెళ్లి సమయంలో రూ. 2 లక్షల కట్నం ఇచ్చి తండ్రి మిథాయ్ లాల్ ఘనంగా పెళ్లి చేశాడు. అయితే పెళ్లైన కొన్ని రోజులకే పుట్టింటి నుండి బైక్ తీసుకురావాలని తరచూ వేధిస్తుండేవాడు. పూనమ్ భర్త సునీల్‌తో పాటు బావ కమలేష్, అత్త బితాన్ దేవిలు మరింత కట్నం తీసుకురావాలంటూ  హింసకు గురి చేశారు.

ఇప్పటికే తండ్రి తన తాహత్తుకు మించి ఖర్చు పెట్టాడని పూనమ్ ఆ బాధను భరిస్తూ వచ్చింది. అయితే అనూహ్యంగా తండ్రికి ఫోన్ కాల్ వచ్చింది. కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని. దీంతో పరుగు పరుగున అత్తాంటిరింటికి చేరుకున్నారు. అయితే ఆ మృతిపై తండ్రికి అనుమానం ఏర్పడింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు, ఇతర బంధువుల కొట్టి చంపి ఉంటారని, దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారన్న అనుమానం ఏర్పడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతుర్ని అదనపు కట్నం తీసుకురావాలంటూ అల్లుడుతో సహా ఐదుగురు హింసించారని పేర్కొన్నాడు. ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నారు ఖాకీలు

Also read

Related posts

Share via