*స్వరూపానంద స్వామి జగన్ ప్రభుత్వ మద్దతుతో కబ్జా చేసిన భూముల్ని కొత్త ప్రభుత్వం వెంటనే స్వాదీనం చేసుకోవాలి….!!!*
*తిరుమలని,దేవాదాయ శాఖని బ్రష్టు పట్టించిన విశాఖ నకిలీ స్వాములోరుని తక్షణమే అరెస్టు చేయాలి…*
అమరావతి:
బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో *రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ సమావేశంలో మాట్లాడుతూ* విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఈరోజు నిర్వహించిన విలేఖరుల సమావేశంలో స్వామీజీ ధోరణి చూస్తుంటే ఏ ఎండ కా గొడుగు పట్టేలా అయన స్టేట్మెంట్ ఉన్నదని, మన దేశంలో ఊసరవెల్లులు కూడా స్వరూపానంద స్వామిని చూసి సిగ్గుపడేలా పత్రికా సమావేశం ఉందని శ్రీధర్ తెలియజేశారు. అసలు పీఠాధిపతి అంటే పూర్తి సన్యాశాశ్రమంలో ఉండి నిత్య అనుస్టానంతో ఆధ్యాత్మిక వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి మంచి చేస్తూ, ధర్మ పరిపాలనలో భాగస్వామ్యం అయ్యేవారు పీఠాధిపతులుగా కొనసాగుతారు. ఈ దేశంలో నాలుగు పీఠాలు మాత్రమే ఆదిశంకరాచార్యులు ప్రతిష్ట చేశారు. అయితే విశాఖలో ఉన్న శారదాపీఠం ఒక నకిలీ పీఠం అని, ఆయన ఒక నకిలీ స్వామీజీ అని, గతంలో స్వామీజీ వేషం ఎత్తకముందు స్వరూపానంద జగదాంబ థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్మేవాడని, మద్యం తాగి ఎక్కడబడితే అక్కడ పడిపోయేవాడని, అతను చిన్నగా కాషాయం తోడుక్కొని ఆధ్యాత్మిక వ్యాపారం ప్రారంభించాడని, ఆయన దగ్గర ఎటువంటి మహిమలు లేవని, కానీ కొంతమంది జనం మరియు కొంతమంది ఉమ్మడి రాష్ట్ర రాజకీయ నాయకులు ఆయన గురించి తెలియక నమ్ముతారని, ఆయన వల్ల చాలామంది నేతలు అధ: పాతాళంలోకి తోసి వేయబడ్డారని, అందులో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఒకడని, రెడ్డికి ఎప్పటికీ రాజకీయ భవిష్యత్తు లేకుండా రాజశ్యామల యాగాలు చేశాడని, అమ్మవారు కూడా స్వరూపానందకు తగిరీతిలో శిక్ష విధించబోతుందని శ్రీధర్ తెలియజేశారు. రాజశ్యామల యాగం పేరుతో వీరు తెలుగు రాష్ట్రాల నేతలను ముఖ్యమంత్రి చేస్తానని డబ్బులు ప్యాకేజీ మాట్లాడుకొని రాజ శ్యామల యాగం చేస్తూన్నారని, అ యాగాలు ప్రతిఫలించినట్లయితే ఇరు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మాజీలు ఎందుకయ్యారని, వారు ఎలా ఓడిపోయారని శ్రీధర్ ప్రశ్నించారు. వైసిపి కి స్వామీజీ జగన్ బాకలాగ మారడాన్ని, జగన్ కి ముద్దులు పెట్టడాన్ని ఏమనాలనీ శ్రీధర్ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వానికి రాజ గురువు లాగా వ్యవహరించి టీటీడీలో అన్ని అరాచకాలు, అక్రమాలు జరుగుతుంటే ఒక్కరోజు కూడా నోరు తెరిచిన పాపాన పోలేదని, దేవాదాయ శాఖలో అవినీతి విపరీతంగా జరుగుతుంటే కనీసం మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. దేవాదాయశాఖ అర్చకులు పై దాడులు జరుగుతుంటే ఒక్క సంఘటనను సాములోరు ఖండించలేదు. రాముని విగ్రహం తల నరికినప్పుడు, రథం తగలపడ్డప్పుడు,దుర్గ గుడిలో వెండి సింహాలు మాయమైతే స్వామీజీ ఎందుకు పట్టించుకోలేదని శ్రీధర్ స్వామీజీని ప్రశ్నించారు. కలియుగ దైవం వేంకటేశ్వరుని సన్నిధిని అపవిత్రం చేస్తూ, సామాన్య భక్తులకు తిరుమలను అందుబాటులో లేకుండా వ్యాపారమయం చేసేసి విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో కమిషన్ వసూలు చేసుకునే సంస్కృతి మీది కాదా స్వామీజీ, దేవాదాయ శాఖ అధికారుల పైరవీలు,కలెక్షన్స్,పైరవీలు మీ పీఠంలో మొన్నటిదాకా తమరు చేయలేదా స్వామీజీ అని ప్రశ్నించారు. ఈ రోజు ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని తిరస్కరించితే ఇప్పటికిప్పుడు చంద్రబాబు ప్రేమ వలకబోసి ఆశీర్వాదాలు దేనికి చెపుతున్నారో ఈ నకిలీ స్వామీజీ ప్రజలకు చెప్పాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. స్వామి స్వరూపానంద విశాఖ పీఠం వదిలేసి హైద్రాబాద్, రుషికేశ్ ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని, విశాఖ పీఠాధిపతి భూ అక్రమాలపై ప్రభుత్వం సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించి ఆ భూముల్ని తక్షణమే ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలని, పీఠం పేరుతో నేరాలు ఘోరాలు చేసిన ఈ నకిలీ స్వాములోరుని తక్షణమే అరెస్ట్ చేయాలని శ్రీధర్ డిమాండ్ చేశారు.
Also read
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!
- Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!
- అయ్యో పాపం.. ఐదేళ్లకే ఆ బాలుడికి ఆయుష్షు తీరిపోయింది..!
- ఎస్బీఐ బ్యాంకుకు కన్నం.. రూ.13 కోట్ల విలువ చేసే బంగారం లూటీ.. లబోదిబోమంటున్న కస్టమర్లు
- స్కూల్‌కి వెళ్లాల్సిన బాలుడు.. బావిలో శవమై తేలాడు.. మిస్టరీగా మారిన మరణం