SGSTV NEWS
CrimeNational

Bengaluru: తండ్రి బాకీ తీర్చలేదని.. బెదిరించి బాలికపై ఘాతుకం


తన బాకీ తీర్చలేని ఓ వ్యక్తి నిస్సహాయతను గుర్తించిన యువకుడు… ఆయన కుమార్తె (17)పై అత్యాచారానికి పాల్పడిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

బెంగళూరు (యశ్వంతపుర), : తన బాకీ తీర్చలేని ఓ వ్యక్తి నిస్సహాయతను గుర్తించిన యువకుడు… ఆయన కుమార్తె (17)పై అత్యాచారానికి పాల్పడిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వడ్డీవ్యాపారం చేసే రవికుమార్ అనే యువకుడి నుంచి బాలిక తండ్రి రూ.70 వేలు అప్పుచేశాడు. ఆ అప్పు, వడ్డీ కోసమంటూ రవి తరచూ బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో వారి ఇంటికి వెళ్లేవాడు. బాకీ పూర్తిగా ఇవ్వకపోతే నాన్నపై కేసుపెట్టి జైలులో పడేయిస్తానని బెదిరించేవాడు. అలా ఓ రోజు లైంగిక దాడికి తెగించాడు. దానిని సెల్ఫోన్లో రికార్డు చేసుకుని.. ఎవరికైనా చెబితే ఈ వీడియో బయట పెడతానని బెదిరించాడు. తర్వాతా ఆమెను భయపెట్టి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇక బాలిక ఆ వేధింపులు భరించలేకపోవడంతో ధైర్యం చేసి విషయాన్నంతటినీ తండ్రికి సోమవారం చెప్పేసింది. ఆయన వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో వారు బాలికను వైద్యపరీక్షలకు పంపి, నిందితుణ్ని అరెస్టు చేశారు

Also read

Related posts

Share this