నిజామాబాద్ లో నివాసముంటున్న ఉప్పలించి వేణు కుటుంబం వడ్దీ వ్యాపారుల నుంచి రూ.3లక్షలు అప్పు తీసుకుంది. ఆపై కూతురికి పెళ్లి సంబంధం ఖాయం అయింది. అదే సమయంలో మొత్తం డబ్బు చెల్లించాల వ్యాపారులు వేధించడంతో ఆ కుటుంబం గోదావరి నదిలో దూకి ఆత్మహత్యయత్నం చేసుకుంది.
ఇటీవలే చిన్న కుమార్తెకు పెళ్లి చూపులు జరిగాయి. నిశ్చితార్థం కూడా అయిపోయింది. మరికొద్ది రోజుల్లోనే ఆ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ క్రమంలో కొందరు ఆ కుటుంబం వేధింపులు మొదలు పెట్టారు. భార్య, కూతురిని విడిచిపెట్టమని.. అందరిలో వివస్త్రలను చేస్తాం అంటూ వేధించారు. వారి వేధింపులు తాళలేక ఆ కుటుంబం మొత్తం గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా.. భార్య ప్రాణాలతో బయటపడింది. ఇక పెళ్లిపీటలెక్కాల్సిన కూతురు గల్లంతు అయింది. అయితే మరి ఆ కుటుంబాన్ని ఎవరు వేధించారు? ఎందుకు వేధించారు? అనే విషయానికొస్తే..

బతుకుదెరువు కోసం నిజామాబాద్ వచ్చారు
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కురుకు చెందిన ఉప్పలించి వేణు(54) – భార్య అనూరాధ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఈ కుటుంబం ఇరవై ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం నిజామాబాద్ కు వచ్చారు. న్యాల్ కల్ రహదారి పక్కన కాలనీలో నివసిస్తున్నారు. వీరికి ఒక పాన్ షాప్ కూడా ఉంది. అనంతరం పెద్ద కుమార్తెకు వివాహం చేశారు. కానీ నాలుగేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఇక అప్పటి నుంచి చిన్న కుమార్తెను ముద్దుగా చూసుకున్నారు. ఇక వీరికున్న పాన్ షాప్ మొదటిగా బాగానే నడిచింది. కానీ అంతకంతకు తగ్గుతూ వచ్చింది. దీంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది.
అదే సమయంలో స్థానికంగా ఉండే వడ్డీ వ్యాపారుల వద్ద రూ.3 లక్షలు అప్పు తీసుకున్నారు. అయితే క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తూనే ఉన్నారు. ఓ రోజు మొత్తం డబ్బు చెల్లించాలంటూ అప్పులిచ్చిన వారు ఆ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేశారు. కొంత సమయం కావాలని ఆ కుటుంబం వేడుకున్నా వదిలి పెట్టలేదు. తరచూ వేధింపులకు పాల్పడ్డారు. తీసుకున్న అప్పు చెల్లించకపోతే భార్య, కూతురిని విడిచిపెట్టమని.. అందరిలో వివస్త్రలను చేస్తాం అంటూ బెదిరించారు
తన చిన్న కుమార్తె పూర్ణిమకు పెళ్లి చూపులు కూడా జరిగాయని.. కొద్ది రోజుల్లో అప్పు మొత్తం తీర్చేస్తామని వేడుకున్నారు. కానీ వడ్డీ వ్యాపారులు వినలేదు. దీంతో మనస్థాపానికి గురైన వేణు, భార్య అనూరాధ, కుమార్తె పూర్ణిమ కలిసి బుధవారం వేకువజామున బాసరకు వచ్చారు. ఆపై గోదావరి బ్రిడ్జ్ పై నుంచి నదిలో దూకేశారు. దీంతో అనూరాధ నీటి ప్రవాహానికి స్నానాలఘాట్ వరకు కొట్టుకొచ్చింది. గమనించిన కొందరు ఆమెను కాపాడి పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెతో మాట్లాడారు. జరిగిన విషయాన్ని చెప్పగా.. ఆమె భర్త వేణు, కూతురి పూర్ణిమ కోసం గాలించగా వేణు మృతదేహం లభ్యమైంది. పూర్ణిమ గల్లంతు కావడంతో ఆమెకోసం గాలిస్తున్నారు. మరోవైపు అప్పులిచ్చిన వడ్డీ వ్యాపారుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..