ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.
తాజాగా, ఇద్దరు సీనియర్ ఐపీఎస్ లను బదిలీ చేసింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాలను బదిలీ చేస్తూ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.
ఆ ఇద్దరు ఐపీఎస్ లకు ఎన్నికల విధులతో సంబంధంలేని బాధ్యతలు అప్పగించాలని, వారి స్థానంలో కొత్తవారిని నియమించాలంటూ ఈసీ తన ఆదేశాల్లో ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఇటీవల ఈసీకి రాసిన లేఖలో రాష్ట్రంలోని పలువురు ఐపీఎస్ అధికారుల తీరును వివరించినట్టు తెలుస్తోంది.
Also read
- ఆపరేషన్ సింధూర్లో ఇప్పటి వరకు ఎంత మంది భారత సైనికులు అమరులయ్యారంటే..?
- `వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చంపేస్తా”యువకుడిపై కేసు నమోదు..
- ఊహించని విధంగా పెళ్లి వాయిదా.. యువతి ఆత్మహత్య
- AP : సీఐని తోసేసిన విడదల రజినీ.. రెచ్చిపోయిన పోలీసులు..
- బావతో సహజీవనం చేస్తోందంటూ..