మచిలీపట్నం…గొడుగు పేట శంకరమఠంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీన జరిగే ఉగాది వేడుకలను విజయవంతం చేయాలి….. బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు,
ఏ ఆర్ కే మూర్తి…….
పట్టాభి స్మారక భవన నిర్మాణానికి మచిలీపట్నం నగర కార్పొరేషన్ లో అనుమతులు ఇవ్వకపోవడం దురదృష్టం అని మచిలీపట్నం బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు ఏ ఆర్ కే మూర్తి అన్నారు.
బ్రాహ్మణ సేవా సంఘం కార్యవర్గ సమావేశం మంగళవారం ఈడేపల్లిలో నిర్వహించి బ్రాహ్మణుల సమస్యలు తదితర విషయాలపై సమావేశంలో చర్చించి ఈనెల 19వ తేదీన గొడుగు పేట శంకరమఠంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు కరపత్రాలను ఆవిష్కరించారు……
ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు,
ఏ ఆర్ కె మూర్తి మాట్లాడుతూ…..
మచిలీపట్నం నగర కార్పొరేషన్ లో హైకోర్టు వారి ఉత్తర్వులను కూడా అమలు చేయకుండా స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు బ్రాహ్మణ జాతి ముద్దుబిడ్డ అయిన స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరిట కులమతాలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మించే స్మారక భవనానికి వైసిపి మేయర్, కార్పొరేటర్లు అనుమతులు ఇవ్వకపోవడం దురదృష్ట కరం అన్నారు.
మచిలీపట్నం నగర కార్పొరేషన్ లో పాలకవర్గ సమయం అయిపోయినందున హైకోర్టు వారి ఉత్తర్వులను గౌరవించి కృష్ణాజిల్లా కలెక్టర్ మంచి నిర్ణయం తీసుకుని ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా పట్టాభి స్మారక భవనానికి వెంటనే అనుమతులు ఇవ్వాలని ప్రజలందరి తరపున జిల్లా కలెక్టర్ ను కోరుతున్నాము అన్నారు.
ఈనెల 19వ తేదీన గొడుగు పేట శంకరమఠంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించడం జరుగుతోందని, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని 19వ తేదీన శంకరమఠంలో
సంగీత గానామృతం, పిల్లలకు
వివిధ రకాల పోటీలు
బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ( ఘనాపాటి) వారిచే పంచాంగ శ్రవణం అనంతరం
వివిధ రంగాలలో నిష్ణాతులైన బ్రాహ్మణ ప్రముఖులకు బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సన్మానాలు జరుగుతాయి అని తెలిపారు. కావున బ్రాహ్మణ బంధువులందరూ హాజరయ్యి ఉగాది వేడుకలను విజయవంతం చేయాలి అని ఏ ఆర్ కె మూర్తి కోరారు.
ఉగాది తెలుగు ప్రజల ముఖ్యమైన పండుగలో ఒకటి అన్నారు.
బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్, పి. వి. ఫణి కుమార్ మాట్లాడుతూ……
మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలసౌరి, ఆర్టీసీ చైర్మన్, కొనకళ్ళ నారాయణరావు, జనసేన మచిలీపట్నం నియోజకవర్గం ఇన్చార్జి, బండి రామకృష్ణ, బిజెపి మచిలీపట్నం నియోజకవర్గం ఇన్చార్జి, సోడిశెట్టి బాలాజీ, మున్సిపల్ మాజీ చైర్మన్, మోటమర్రి వెంకట బాబా ప్రసాద్ తదితరులతోపాటు పట్టణ ప్రముఖులు, ప్రజలు పట్టాభి స్మారక భవనం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి, హైకోర్టుకు వెళ్లిన వైసీపీ మేయర్, వైసిపి కార్పొరేటర్లు పట్టాభి స్మారక భవన నిర్మాణంపై ఎందుకు అంత కక్ష పెంచుకొని కౌన్సిల్లో అనుమతులు ఇవ్వలే దో
ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం వారిపై ఎంతైనా ఉంది అన్నారు.
మచిలీపట్నం నగర కార్పొరేషన్ లో కౌన్సిల్ టైము అయిపోయినందున హైకోర్టు వారి ఉత్తర్వులను గౌరవించి జిల్లా కలెక్టర్ మంచి నిర్ణయం తీసుకుని, ప్రజా ప్రతినిధుల సహాయ సహకారాలతో పట్టాభి స్మారక భవనం కొరకు అనుమతులు వెంటనే ఇచ్చి పనులు ప్రారంభించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ను కోరుతున్నాము అన్నారు.
ఈ కార్యక్రమంలో
ఏఆర్కే మూర్తి, పి. వి. ఫణి కుమార్ తో పాటుగా
బ్రాహ్మణ సేవ సంఘం నాయకులు,
మోపర్తి సుబ్రహ్మణ్యం ,
పి ఎస్ ఎస్ ఆర్ శర్మ, వడ్లమన్నాటి మారుతి దివాకర్, నిమ్మగడ్డ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Also read
- పట్టాభి స్మారక భవన నిర్మాణ విషయంపై జిల్లా కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకోవాలి……
- Vastu Tips: బల్లి మీద పడినా, కలలో కనిపించినా మీ ప్యూచర్ ఎలా ఉంటుందో తెలుసా?
- భర్త చనిపోయాక మంగళసూత్రం ఏం చేయాలి..? 99శాతం మంది చేస్తున్న తప్పు ఇదే..
- నేటి జాతకములు 18 మార్చి, 2026
- గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా చింతలపాటి వెంకటరామయ్య ఘనంగా (సి.వి.ఆర్) నామినేషన్




