October 17, 2024
SGSTV NEWS
Andhra Pradesh

చింతామణి నాటకాన్ని తలపిస్తున్న అమరావతి రాజధాని నాటకం.


ది 15/16-9-2024 ,
రాజమండ్రి …



అమరావతే రాజధాని అంటే ఈ తరం వారు కాదు మరేతరం చూడలేరు ..

ఈ తరం వారు చూడగలిగే రాజధాని ప్రాంతాలు గుంటూరు , రాజమండ్రి, విశాఖపట్నం , కర్నూల్ మాత్రమే ..

అప్పులు కట్టడానికే ఆంధ్రప్రదేశ్ ఆవిర్బవించిందా  !

నేటి ఆంధ్రుడు నిర్మాణాత్మకమైన రాజధాన్ని చూడగలడా !
**********************
మేడా శ్రీనివాస్ , విమర్శ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..
**********************
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాహుబలి కట్టప్ప పాత్రను మరిపిస్తున్న పవన్ కళ్యాణ్ అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్ర ఆక్షేపణ చేసారు ..

2014 సం. వం. లో ఆ నాటి కేంద్ర ప్రభుత్వం  ఆశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ ను విభజించి ఘోరమైన అన్యాయం చేసిందని ,
ఆ రోజు సమైఖ్యాంద్రా ఉద్యమం అంటు కొంతమంది ఆంధ్ర రాష్ట్ర ద్రోహులు పెట్టుబడిదారుల వద్ద అవినీతి ముడుపులు తీసుకుని రాత్రికి రాత్రి సమైఖ్య ఆంధ్ర ఉద్యమాన్ని సీమాంద్ర ఉద్యమంగా మార్చేసి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ పై ఆనాడే విషం చిమ్మారని , నేటికి ఆ ద్రోహం మన రాష్ట్రాన్ని వెంటాడుతూనే వుందని , 2014 సం రం లో జరిగిన విభజన ఉద్యమం అంత ఒక బూటకమని , అక్కడ కేసీఆర్ కు , ఇక్కడ ఆంధ్ర మేధావులకు ముడుపులు అందజేసి లబ్ది పొందినది ఎవరు ! అనే నిజాన్ని సమాధి చేసేసారని , ఆ రోజు విభజన ఉద్యమాన్ని విద్రోహ చర్యలుగా మార్చేసారని , అప్పటి
యు పి ఏ సర్కార్ అరాచకాన్ని ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా ప్రాంతాల ధరణిపై ధశాబ్దలుగా సమసి పోని విధంగా ముళ్లకంపను పొదిగారని , కేసీఆర్ , ఆంధ్ర మేధావుల విభజన ఉద్యమం ఆనాటి చింతామణి నాటకాన్ని తలపించిందని , చంద్రబాబుతో సహా
ఆ నాడు ఈ అరాచకానికి భాద్యులని , కొన్ని కార్పొరేట్ పార్టిలు అయితే తెలంగాణాలో విభజన ఉద్యమం, ఆంధ్రప్రదేశ్ లో సమైఖ్య (సీమాంద్ర) ఉద్యమం అంటు మోసాన్ని , ద్రోహన్ని ఉమ్మడిగా నడిపించి సొంత లాభాలు పొందారని , నేడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే నంటు యావత్ ఆంధ్రులకు మరో ద్రోహం చేస్తున్నారని , ప్రస్తుత అమరావతి రాజకీయ నాటకం ముందు ఆ నాటి చింతామణి నాటకం ఎందుకు పనికి రాదని , అమరావతి రాజధాని ముసుగులో జరుగుతున్న అతి పెద్ద కుంబకోణన్ని యావత్ ఆంధ్రులు వ్యతిరేకించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కు పునాదులుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

మొండిగా ఆంధ్రప్రదేశ్ పాలకులు వారి వారి రాజకీయ , ఆర్ధిక సొంత ప్రయోజనాల కోసం మన ఆంధ్ర రాష్ట్రానికి అమరావతే రాజధాని అంటే ఈ తరం వారే కాదు భవిష్యత్ తరాల వారు సైతం ఒక అద్భుతమైన రాజధాన్ని చూడలేరనేది జగమెరిగిన వాస్తవం అని , కేవలం రాజధాని పేరు మాత్రమే వినపడుతుందని , శాస్త్రీయపరమైన అవగాహన లేకుండా కొంతమంది సంపన్నుల సౌకర్యార్ధం ఒక రాష్ట్రానికి రాజధాన్ని నిర్మిస్తామనటం మూర్కపు చర్యగా బావించాలని , అనుభవజ్నులు , శాస్త్రీయ పరమైన నిష్టాతులు అమరావతి రాజధానిగా అనువైన ప్రదేశం కాదని , ఈ ప్రాంతంలో నిర్మాణాలకు సుమారు 40 అడుగుల లోతు వెళ్లాల్సి వస్తుందని , సహజంగా ఈ విధమైన లోతు సముద్రంలో చేసే నిర్మాణాలకు అవసరం అని , అదే విధంగా ఈ ప్రాంతం ఎప్పుడు నీటి ప్రమాదాలకు గురైయ్యే లోతటట్టు ప్రదేశం అని అనుభవజ్నులు చెబుతున్నా చంద్రబాబు మొండిగా ముందుకెళ్ళటం బాధాకరమని , ఇప్పటికే 9.5 కోట్ల పై భడి రాజధాని నిర్మాణం పేరుతో ఖర్చు చేసినట్టు కల్పిత గణాంకాలు చెబుతున్నాయని , పురిటి కష్టాలు అనుభవిస్తున్న ఆంధ్రప్రదేశ్ కు ఈ తరహా మూర్కపు ఖర్చు అవసరమా ! ఆంధ్రప్రదేశ్ కు ఈ తరం వారు చూడగలిగే ఏకైక రాజధాని , అనువైన ప్రాంతాలు , తక్కువ సమయంలో, తక్కువ నిధులుతో సాధ్యమయ్యేది , అనువైనది గుంటూరు , రాజమండ్రి , విశాఖపట్నం , కర్నూల్ ప్రాంతాలేనని , ఇప్పటికే అన్యాయమైపోయిన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ పై మరో రాజకీయ పెత్తందారి కుట్ర జరుగుతుందని , ఆంధ్రులు చూస్తు కూర్చుంటే మన బిడ్డల భవిష్యత్ కు బారి ప్రమాదం సంభవిస్తుందని ఆయన హెచ్చిరించారు .

ఆంధ్రప్రదేశ్ ను విభజించింది , రాజధాని నిర్మాణం పేరుతో చింతామణి నాటకాన్ని
మై మరిపిస్తున్నది ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల కూపంలోని తీసుకుపోవటానికా ! అప్పులు అన్ని జిల్లాల ప్రజల నెత్తిపై మోపి రాజకీయ అవినీతి దాహం తీర్చుకుంటూ రాష్ట్ర అభివృద్ధిని నేటి పాలకులు సర్వ నాశనం చేస్తున్నారని , ప్రస్తుత పాలకుల దురహంకార చర్యలతో నేటి ఆంధ్రుడు ఒక చక్కని నిర్మాణత్మాకమైన రాజధాన్ని చూడగలదా ! సినిమా గ్లామర్ తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేదికగా చేసుకున్న పవన్ కళ్యాణ్ తోలుత ఆంధ్ర ఎంపీలకు పౌరుషం లేదా , అందుకోసం ఒంటికి కారం పూసుకోండి , తోలు తీస్తాను , నేను భయపడను  , నాకు భయమే లేదు , చేగువీరా వారసుడును అంటు పెద్ద పెద్ద పూనకం ఉపన్యాసాలతో ఒక వర్గం ప్రజలను నమ్మించి నేడు బాంచన్ దొర అంటు మోడీ కాళ్ళు మొక్కుతూ ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవాన్ని రోడ్డున పెట్టిన ఘనత పవన్ కళ్యాణ్ కే దక్కుతుందని , ఇప్పుడు కారం ఎవరు పూసుకోవాలో పవన్ కళ్యాణే చెప్పాలని , ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నైతే బాహుబలి సినిమాలో కట్టప్ప సిగ్గు పడే విధంగా కట్టు బానిసగా ఆంధ్రప్రదేశ్ హక్కులు , ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని , కొంతమంది సినిమా వాళ్లకు ఆంధ్రప్రదేశ్ ను మోసం చేయటమే పనిగా రాష్ట్రాన్ని సొంత ప్రయోజనాలకు దోచుకుంటున్నారని , అలాంటి వారిని ఆంధ్రులు గమనిస్తున్నారని ,
ఈ చింతామణి నాటకాలకు త్వరలో కాలం చెల్లే రోజులు దగ్గర పడుతున్నాయని , ఇప్పటికే నూతన ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం దిశగా ఆంధ్రప్రదేశ్ లో గల యువత , మేధావులు , విద్యార్థులు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుపుతున్నారని , నేటి వ్యాపార రాజకీయ పార్టిలకు ఆంధ్రులు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని , ఆంధ్రప్రదేశ్ కు వచ్చేవన్ని మంచి రోజులేనని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేసారు .

ఈ సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు .

ఈ సమావేశంలో అర్పిసి సెక్యూలర్స్ సర్వశ్రీ సిమ్మా దుర్గారావు , దూడ్డే త్రినాద్ , ఎండి హుస్సేన్ , వర్ధనపు శరత్ కుమార్ , ఆకుల మనీకాంత్, బసా సోనియా, గుడ్ల దుర్గా ప్రసాద్ , సుంకర వెంకట భాస్కర రంగారావు , బత్తెన శివన్నారాయణ, కొమర్తి గోపి శ్రీనివాసరావు , పిట్టా శ్రీను, అన్నందేవుల సత్యనారాయణ మూర్తి, తూట వీరయ్య  తదితరులు పాల్గొనియున్నారు ..

— మేడా శ్రీనివాస్ ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్..

Related posts

Share via