July 3, 2024
SGSTV NEWS
CrimeTelangana

ఆ ఒక్క కారణంతో కూతురిపై కన్న తల్లిదండ్రుల దారుణం!

ఏ తల్లిదండ్రులకైనా.. తమ పిల్లలు విషయంలో ఎప్పుడు భారంగా అనిపించాదు. అందుకే వారు పుట్టిన దగ్గర నుంచి పెదయ్యే వరకు వారి అలనాపాలానా చూస్తూ.. వారిపై ఓ కన్ను వేసి ఉంటారు. ఇక అలాంటి తల్లిదండ్రులు ఉన్న ఈ కాలంలో తాజాగా ఓ తల్లిదండ్రులు మాత్రం కూతురి మానసిక స్థితి సరిగ్గా లేదని విసిగిపోయి హతమార్చారు.

ప్రతిఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటారు. ఈ క్రమంలోనే వారు పుట్టిన దగ్గర నుంచి వారికి పెళ్లిచేసినంతా వరకు వారి అలనాపాలనా చూస్తూ.. వారిపై ఎప్పుడు ఓ కన్నువేసే ఉంటారు. ఎందుకంటే..  ఏ తల్లిదండ్రులకైనా.. తమ పిల్లలు విషయంలో ఎప్పుడు భారంగా అనిపించాదు. అందుకే వారిని కన్న తల్లిదండ్రలను అయినా నిర్లక్ష్యం చేస్తారేమో కానీ, పిల్లల విషయం లో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. మరి, తాము కన్న పిల్లలు ఏ వయసుకు వచ్చిన వారిపై భద్యతగా వ్యవహరిస్తున్న తల్లిదండ్రులు ఉన్న ఈ కాలంలో.. తాజాగా ఓ తల్లిదండ్రులు మాత్రం తమ కూతురి మానసిక స్థితి సరిగ్గా లేదని విసిగిపోయి హతమార్చారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

అల్లారుముద్దుగా పెంచిన అమ్మానాన్నలే.. వారి చేతులతో తమ కుమార్తెను హతమార్చారు. తమ కూతురి మానసిక స్థితి సరిగా లేదని ఆసుపత్రులు, దేవాలయాల చుట్టూ తిరిగిన  ఫలితం లేదని విసుగు చెందిన తల్లిదండ్రులు.. తమ 13 నెలల మనవడికి తల్లిని దూరం చేశారు. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. కాగా, నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఆదివారం చెప్పారు. ఇక ఆయన తెలిపిన వివరాల మేరకు.. తంగళ్లపల్లి మండలం నేరెల్ల గ్రామానికి చెందిన చెప్యాల నర్సయ్య-ఎల్లవ్వ దంపతుల పెద్ద కుమార్తె ప్రియాంక(25) గత ఏడు సంవత్సరాలుగా మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఆమెను ఆసుపత్రులు, దేవాలయాల వద్దకు తీసుకెళ్తూ చాలా డబ్బు ఖర్చు చేశారు. దీంతో కొంతవరకు వ్యాధి నయం కావడంతో 2020లో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని దర్గాపల్లికి చెందిన పృథ్వీతో వివాహం చేశారు.

ఇక వారు కరీంనగర్‌లోని సప్తగిరి కాలనీలో ఉంటున్నారు. కాగా,  వీరికి ఇప్పుడు 13 నెలల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే నెల రోజులుగా ప్రియాంక మునుపటి లాగే మానసిక వ్యాధితో బాధపడుతూ అందరిని ఇబ్బంది పెడుతోంది. దీంతో ఎప్పటిలానే చుట్టుపక్కల వారిని దూషించడం, గొడవలు పెట్టుకోవడంతో భర్త.. ఆమె తల్లిదండ్రులకు తెలియజేశాడు. కాగా, వారు బుగ్గరాజేశ్వరస్వామి ఆలయం వద్దకు తీసుకెళ్లి అక్కడ మూడు రోజులు ఉంచారు. నయం కాకపోవడంతోపాటు ఆమె ప్రవర్తనను చూసి తల్లిదండ్రులు విసిగిపోయారు. ఈ క్రమంలోనే..నేరెల్లకు తీసుకొచ్చి ఈ నెల 14న రాత్రి ఆమె ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో నూలు దారం గొంతుకు బిగించి హత్య చేశారు. అనంతరం ఈనెల 15న అత్తగారి గ్రామం దర్గాపల్లికి తీసుకెళ్లి అక్కడ చేతబడి వల్ల మరణించిందని చెప్పి అందర్నీ నమ్మించి అంత్యక్రియలు నిర్వహించారు.

దీనిపై నేరెల్ల గ్రామస్థులకు అనుమానం రావడంతో డయల్‌ 100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేయగా..  కన్న తల్లిదండ్రులే హత్య చేసినట్లు తేలడంతో స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు నుంచి ఫిర్యాదు తీసుకొని వారిని ఆదివారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. మరి, కూతురి మానసిక వ్యాధి నయం కాకపోవడంతో విసుగు చెంది హత్య చేసిన ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Also read

Related posts

Share via