చేయి కట్ చేసుకున్న ప్రియురాలని చూసి ప్రియుడి గుండె పోటుతో మరణించిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ప్రియురాలు రక్తాన్ని చూసి ఆ యువకుడు సృహ తప్పి పడిపోయాడు. వెంటనే పరీక్షలు నిర్వహించగా మరణించినట్లు వైద్యులు తెలిపారు.
అకస్మాత్తుగా గుండె పోటుతో మరణించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. మనకి తెలిసి కొన్ని ఇలాంటి ఘటనలు జరిగితే తెలియకుండా జరిగేవి చాలానే ఉన్నాయి. ఇటీవల ఢిల్లీలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ యువతి చేయి కట్ చేసుకుంది.
ప్రియురాలిని చూసి..
రక్తం కారుతున్న చేతిని వీడియో తీసి తన బాయ్‌ఫ్రెండ్ అరుణ్ నందాకి పంపించింది. టెన్షన్ పడుతూ ఆ యువకుడు ఆసుపత్రికి పరిగెత్తి వెళ్లగా.. ప్రియురాలి ఉన్న పరిస్థితిని చూసి ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతనికి పరీక్షలు చేయగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
అకస్మాత్తుగా గుండె పోటు రావడం వల్లనేనా..
ఆ యువకుడు ఆందోళనతో దీనస్థితిలో ఉన్న తన ప్రియురాలిని చూడటం వల్ల గుండెపోటు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ యువతి రక్తాన్ని చూసి భయపడి గుండె పోటు వచ్చిందా? లేదా అనే విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
రక్తాన్ని చూసి అకస్మాత్తుగా చనిపోయాడా? లేకపోతే ఇంకా ఏదైనా సమస్య అనే కోణంలో విచారిస్తున్నారు. అరుణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గుండె పోటు అని వైద్యులు చెప్పిన కూడా పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. చేతికి అందిన కొడుకు ఇలా మరణించడంతో కన్నీరు మున్నీరవుతున్నారు.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్‌కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





