నల్గొండ జిల్లా నిడమనూరులో ఒకే ఇంట్లో తల్లీ, ఆమె కొడుకు మృతదేహాలు రక్తపుమడుగులో పడి ఉన్నాయి. మద్యం మత్తులో కొడుకే తల్లిని చంపి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నరు
చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం
నిడమనూరు, : నల్గొండ జిల్లా నిడమనూరులో ఒకే ఇంట్లో తల్లీ, ఆమె కొడుకు మృతదేహాలు రక్తపుమడుగులో పడి ఉన్నాయి. మద్యం మత్తులో కొడుకే తల్లిని చంపి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… స్థానికులైన రావిరాళ వీరయ్య, సాయమ్మ(65) దంపతులకు కుమారులు శ్రీను, శివ(39), కుమార్తె పద్మ ఉన్నారు. పద్మ కుమార్తె మేఘనను డ్రైవర్గా పనిచేస్తున్న శివకిచ్చి పన్నెండేళ్ల క్రితం వివాహం చేశారు. వారికి పిల్లలు లేరు. మనస్పర్థల కారణంగా ఇద్దరూ రెండేళ్ల క్రితం పెద్దల సమక్షంలో విడిపోయారు. మేఘనకు శనివారం హైదరాబాద్లో మరో వ్యక్తితో వివాహమైంది. ఆ పెళ్లికి తన తల్లిదండ్రుల మద్దతు ఉందనే అనుమానంతోపాటు తండ్రి వివాహానికి కూడా వెళ్లాడని శివ కోపం పెంచుకున్నాడు. మద్యం మత్తులో శనివారం రాత్రి పొద్దుపోయాక తల్లితో గొడవపడ్డాడు. క్షణికావేశంలో వంటగదిలో వాడే కత్తితో ఆమె గొంతు కోసి, కడుపులో పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం గది నుంచి బయటకు వచ్చి తానూ గొంతు కోసుకొని అక్కడే చనిపోయాడు. వివాహానికి వెళ్లిన శివ తండ్రి వీరయ్య, మిర్యాలగూడలో ఉంటున్న శ్రీను ఇద్దరూ ఆదివారం ఉదయం ఇంటికి వచ్చే సరికి సాయమ్మ, శివ విగతజీవులై ఉండటాన్ని చూసి హతాశులయ్యారు. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్రాజు, హాలియా సీఐ జనార్దన్డ్, నిడమనూరు ఎస్సై గోపాల్రావు… ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు వీరయ్య ఇచ్చిన ఫిర్యాదుతో హత్య, ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..