SGSTV NEWS online
CrimeNational

కానిస్టేబుల్ కు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చిన దుండగులు



కొందరు దుండగులు విషపూరిత ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆసుపత్రిపాలైన ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ముంబయిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ముంబయి: కొందరు దుండగులు విషపూరిత ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆసుపత్రిపాలైన ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ముంబయిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కానిస్టేబుల్ విశాల్ పవార్ (30) గత నెల 28న రాత్రి 9:30 గంటలకు విధులకు వెళ్లేందుకు లోకల్ ట్రైన్ ఎక్కారు. ఆయన తలుపు దగ్గర నుంచుని ఫోన్ మాట్లాడుతున్న సమయంలో రైలు నెమ్మదిగా వెళ్తుండగా, కింది నుంచి ఓ వ్యక్తి విశాల్ చేతిని కొట్టాడు. కిందపడిన ఫోన్ను తీసుకుని అతడు పారిపోయే యత్నం చేయగా, విశాల్ రైలు దిగి అతణ్ని వెంబడించారు. కొంతదూరం వెళ్లాక డ్రగ్స్ మత్తులో ఉన్న ఆ వ్యక్తి సహచరులు కొందరు విశాల్ను చుట్టుముట్టి.. ఇంజెక్షన్ను వీపు మీద గుచ్చారు. నోట్లో ఎర్రని ద్రవాన్ని పోశారు. దీంతో స్పృహ కోల్పోయిన విశాల్కు తర్వాతి రోజు ఉదయం మెలకువ వచ్చింది. ఇంటికి వెళ్లిన అనంతరం విశాల్ ఆరోగ్యం క్షీణించడంతో అదే రోజున ఆయన్ను కుటుంబసభ్యులు ఠాణేలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. మూడు రోజులు మృత్యువుతో పోరాడిన ఆయన బుధవారం కన్నుమూశారు.

Also read

Related posts