SGSTV NEWS
CrimeTelangana

ఆ శ్రీనుగాడి వల్ల మనశ్శాంతి లేకుండా పోయింది.. నాకు బతకాలని లేదు



మేడ్చల్ జిల్లా: మమ్మీ నన్ను క్షమించు.. నాకు బతకాలని లేదు..నీకు కూడా తెలుసు ఆ శ్రీను గాడు.. వాళ్ల అమ్మ, నాన్నలు.. మనకు మనశాంతి లేకుండా చేస్తున్నారు.. రోజూ ఇంటి వద్ద జరిగే గొడవ భరించలేకపోతున్నా.. అంటూ ఓ మైనర్ బాలిక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పేట్బషీరాబాద్  పోలీస్ స్టేషన్ (petbasheerabad police station)

కొంపల్లి (Kompally) పోచమ్మగడ్డకు చెందిన అనూరాధకు ఇద్దరు ఆడపిల్లలు. ప్రైవేట్ ఫైనాన్స్లో అప్పు తీసుకున్న ఆమె భర్త వారి వేధింపులు భరించలేక చనిపోయాడు. అనూరాథ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తండ్రి చేసిన అప్పులతో ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సిబ్బంది బకాయి చెల్లించాలని ఇటీవల వేధింపులకు గురి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అనురాధ బావ శ్రీను ఎలాగైనా అనురాధ, ఇద్దరు కుమార్తెలను కుటుంబాన్ని ఇంటి నుండి గెంటేయాలని కొద్ది రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడు.

దసరా పండుగ రోజు అనూరాధ ఇంట్లోని లేని సమయంలో వచ్చిన శ్రీను తనకు రావల్సిన డబ్బులు ఇవ్వాలని గొడవ చేశాడు. అవమానకరంగా మాట్లాడటంతో మానసికంగా కుంగిపోయిన మైనర్ బాలిక ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు కారణమైన శ్రీనును కఠినంగా శిక్షించాలని సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts