ఏడాది బాబు ఉన్న తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలిచివేస్తోంది. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రసన్నలక్ష్మి(28), తిరుపతికి 2023లో వివాహమైంది. ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నారు. భర్త, అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధించారు
ఏడాది బాబు ఉన్న తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని జగిత్యాలలో చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రసన్నలక్ష్మి(28), తిరుపతికి 2023లో పెళ్లి అయింది. ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నారు. ఏడాది కిందట వీరికి బాబు పుట్టడంతో ప్రసన్న జాబ్ మానేసింది. దీంతో భర్త, అత్తింటివారు అదనపు కట్నం కోసం ప్రసన్నలక్ష్మిని వేధించారు. అంతేకాకుండా అయితే తిరుపతి, లక్ష్మి ప్రసన్న చామనచాయ రంగులో ఉంటే కొడుకు తెల్లగా, అందంగా పుట్టాడని అనుమానం పెంచుకొని తిరుపతి భార్యను నిత్యం వేధించేవాడు.
వేధింపులు తట్టుకోలేక
ఈ వేధింపులు తట్టుకోలేని ప్రసన్న ఇటీవల పుట్టింటికి వచ్చిన ఇంట్లోని అద్దంపై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. తన కొడుకును అత్తమామలకు ఇవ్వకుండా మీరే జాగ్రత్తగా చూసుకోండి నాన్న అంటూ రాసింది. కాగా ఇటీవలే ప్రసన్నలక్ష్మి కుమారుడి మొదటి పుట్టినరోజు వేడుకలను సైతం గ్రాండ్ గా నిర్వహించారు. ఈరోజు దైవ దర్శనానికి తిరుపతి వెళ్లాల్సి ఉండగా తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ప్రసన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కూతురు చావుకు భర్త, అత్తమామలే కారణమని లక్ష్మీ ప్రసన్న తండ్రి ఫిర్యాదు చేయగా, తిరుపతి అతని తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025