SGSTV NEWS
CrimeTelangana

TG Crime: పండుగ పూట పెను విషాదం.. నల్గొండలో ముగ్గురు స్పాట్ డెడ్!


నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో కొందరికి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

నల్గొండ(nalgonda) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. సోమవారం ఉదయం చింతపల్లి మండలం నసర్లపల్లి సమీపంలో అతి వేగంతో దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ భయంకరమైన ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో కొందరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల ప్రజలు మరియు స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ముగ్గురు దుర్మరణం:
అనంతరం పోటీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. కారు అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also read

Related posts