జయశంకర్ జిల్లా మంగపేట మండలం ఏటూరునాగారంలో జీవితంపై విరక్తితో సురేష్ అనే వ్యక్తి బ్రిడ్జికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు
TG Crime: జయశంకర్ జిల్లా ఏటూరునాగారంలో విషాదం చోటుచేసుకుంది. జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి బ్రిడ్జికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగపేట మండలంలో ఆదివారం ఉదయం జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మశాలి వాడకు చెందిన సురేష్.. ఏటూరునాగారం రామాలయం వీధికి చెందిన రేణుకను పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరూ మండల కేంద్రంలో ఉంటూ కొంత కాలంగా బేకరీలో పని చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే.. ఈ మధ్య మద్యానికి బానిసైన సురేష్ పనులకు వెల్లకుండా భార్యతో గొడవపడుతూ కాలం వెళ్లదీస్తున్నాడు.
బ్రిడ్జికి ఉరి వేసుకుని..
నెల రోజుల క్రితం మంగపేటలో ఉంటున్న తన అక్క నర్సమ్మ ఇంటికి వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురైన సురేష్‌ను అక్క, ఆమె పిల్లలు ఏటూరునాగారంలోని సామాజిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే వైద్యం చేయించి భార్యకు సమాచారం ఇచ్చారు. తరువాత ఆదివారం గౌరారం వాగు బ్రిడ్జికి సురేష్ (37) ఉరివేసుకుని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- చేపల కూర కోసం యువకుడ్ని హత్య చేసిన స్నేహితులు!
- అయ్యో పాపం.. రిజల్ట్స్కు భయపడి పురుగుల మందుతాగి సూసైడ్.. కట్ చేస్తే పాస్
- Aghori: చంచల్గూడ జైలుకు అఘోరీ.. ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!
- TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!
- శ్రీ మహావిష్ణువు చెప్పిన ఈ మాటలు మీ జీవితాన్నే మార్చేస్తాయి.. ఏం చెప్పాడో తెలుసా..?