పెళ్లయిన మూడునెలలకే ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి భర్త , అత్తమామలు కారణమంటూ అమ్మాయి తరుపు బంధువులు దాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరం పేట మండలం అగ్రహారంలో చోటు చేసుకుంది. పోలీసులు, విలేకర్లపై కూడా దాడి జరిగింది.
TG Crime : పెళ్లయిన మూడునెలలకే ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి భర్త ,అత్తమామలు కారణమంటూ అమ్మాయి తరుపు బంధువులు దాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరం పేట మండలం అగ్రహారంలో చోటు చేసుకుంది. అగ్రహారానికి చెందిన వట్టెం మహేష్ కు, వెల్దుర్తి మండలం శేరిలాకు చెందిన పూజతో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది.
మూడు నెలలుగా బాగానే ఉన్నా శనివారం ఉదయం ఏం జరిగిందో తెలియదు కానీ పూజ ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో మహేష్ కుటుంబ సభ్యులు పోలీసులకు, పూజ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న పూజ బంధువులు ఆవేశంతో దాడికి దిగారు. రోజాను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ ఆమె తల్లిదండ్రులు, బంధువులు.. మహేష్ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు.
అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు అడ్డుకోబోయినప్పటికీ వారు వినలేదు. పోలీసులతో పాటు వార్తా సేకరణకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక క్రమంలో అక్కడ ఏం జరుగుతుందో అర్ధం కాక స్థానికులు పరుగులు పెట్టారు. పోలీసులు సమరస్యంగా వ్యవహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- Andhra: ఇద్దరు వ్యక్తులు, 8 చికెన్ బిర్యానీ ప్యాకెట్లు.. హాస్టల్ గోడ దూకి.. సీన్ కట్ చేస్తే.!
- Andhra: ఏడాదిన్నరగా తగ్గని కాలినొప్పి.. స్కానింగ్ చేయగా తుని హాస్పిటల్లో అసలు విషయం తేలింది
- పెళ్లిలో వధువు రూమ్ దగ్గర తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. ఒక్కసారిగా అలజడి..
- Andhra: నెల్లూరునే గజగజ వణికించేసిందిగా..! పద్దతికి చీర కట్టినట్టుగా ఉందనుకుంటే పప్పులో కాలేస్తారు
- గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరి.. కారణం తెలిస్తే అవాక్కే.. ఎక్కడ ఉన్నాయో తెలుసా..?





