వనపర్తి జిల్లా రెవల్లి మండలం నాగపూర్‌లో ఇంట్లో నిత్యం గొడవలు, వేధింపులకు గురిచేస్తోందనే ఆగ్రహంతో కోడలు తన వృద్ధ అత్తను కర్రతో కొట్టి చంపింది. మృతురాలు ఎల్లమ్మ (73)గా గుర్తింపు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
అత్తా కోడలి సంబంధం భారతీయ కుటుంబ వ్యవస్థలో ఒక అత్యంత ప్రత్యేకం, సంక్లిష్టమైన బంధం. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల అనుబంధం మాత్రమే కాదు.. రెండు కుటుంబాల సంస్కృతుల కలయిక. అత్త ఇంట్లో పెద్ద దిక్కుగా, కోడలు ఆ ఇంటికి కొత్త వెలుగుగా ప్రవేశిస్తుంది. ఈ బంధంలో తరచుగా ప్రేమ, గౌరవం, బాధ్యత, కొన్నిసార్లు భిన్నాభిప్రాయాలు కూడా ఉంటాయి. పరస్పర అవగాహన, ఓర్పు, అనురాగం ఈ బంధాన్ని మరింత మధురంగా మారుస్తాయి. ఒకరు మరొకరికి మద్దతుగా నిలిచినప్పుడు.. ఈ ఇద్దరు స్త్రీలు కలిసి ఇంటికి ఆనందాన్ని, శ్రేయస్సును అందిస్తారు. అయితే తెలంగాణలో అత్త వేధింపులు తట్టుకోలే కొడలు ఆమెను కొట్టి చంపింది.
అత్తను కర్రతో కొట్టి చంపిన కోడలు..
వనపర్తి జిల్లా రెవల్లి మండలంలోని నాగపూర్ గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నిత్యం గొడవలు, వేధింపులకు గురిచేస్తోందనే ఆగ్రహంతో కోడలు తన వృద్ధ అత్తను కర్రతో కొట్టి చంపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగపూర్ గ్రామానికి చెందిన ఎల్ల్లమ్మ (73), దాసయ్య దంపతులకు నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. భర్త దాసయ్య కొన్ని సంవత్సరాల క్రితం మరణించగా, ఎల్లమ్మ తన కుమారుడు మల్లయ్యతో కలిసి నివసిస్తోంది. అయితే ఎల్లమ్మకు, ఆమె కోడలు బోగురమ్మకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బోగురమ్మ తీవ్ర ఆగ్రహానికి లోనైంది. అత్త ఎల్లమ్మను కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
స్థానికులు ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించగా.. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. అత్త నిత్యం వేధింపులకు గురిచేయడం వల్లే చంపినట్లు బోగురమ్మ పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించింది. మృతురాలు ఎల్లమ్మ రెండో కూతురు బచ్చమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెవల్లి ఎస్ఐ రాజిత తెలిపారు. ఈ దారుణ సంఘటన నాగపూర్ గ్రామంలో కలకలం రేపింది.
Also read
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!
- మరదలితో పెళ్లి జరపడం లేదనే మనస్తాపం.. పురుగుల మందు తాగిన యువకుడు..!
- Konaseema: పెంచుకున్న తల్లిదండ్రులకే పంగనామం పెట్టిన కూతురు.. ఆస్తి, డబ్బులు తీసుకుని వదిలేసింది..
- భక్తులు ఇచ్చే దక్షిణలు సరిపోక.. పవిత్ర వృత్తికే మచ్చ తెచ్చిన పూజారి.. ఏం చేశాడో తెలుసా?
- ఐపీఎస్ వై పురాన్ సూసైడ్ కేసులో కొత్త మలుపు.. దర్యాప్తులో పాల్గొన్న అధికారి ఆత్మహత్య!