భట్టిప్రోలు (బాపట్ల) : భట్టిప్రోలులో ఉద్రిక్తత నెలకొంది. పోలీసు యాక్ట్ 30 అమలవుతోంది. వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ వరికూటి ఆశోక్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ఇద్దరూ ఒకరిపైఒకరు సవాళ్లు విసురుకున్నారు. సాయిబాబా పేకాట క్లబ్ నిర్వహిస్తున్నాడని, నిరూపిస్తానంటూ … సాక్షాధారాలతో భట్టిప్రోలు రధం సెంటర్ కు వరికూటి అశోక్ బాబు బయలుదేరారు. ఇద్దరు నేతలు భట్టిప్రోలు రథం సెంటర్ వద్ద తేల్చుకుందాం అంటూ … చర్చా వేదికకు తెర లేపారు. ఈ నేపథ్యంలో … ఎలాంటి చర్చలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయినప్పటికీ తాను బయలుదేరి తీరతానని వరికూటి అశోక్‌బాబు చెప్పారు. ఇద్దరు నేతల సవాళ్ల నేపథ్యంలో .. బాపట్ల జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లతో వరికూటి అశోక్ బాబు ఇంటిని పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. అశోక్‌బాబును బయటకు రానీయకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!