అమెరికా గన్ కల్చర్‌కు మరో తెలుగు విద్యార్థి బలైపోయాడు. ఓ దుండగుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన చంద్రశేఖర్ అనే విద్యార్థి బుల్లెట్ గాయాలతో మరణించాడు. చంద్రశేఖర్ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
పై చదువుల కోసమని, ఉద్యోగాల కోసమని విదేశాలకు వెళ్తున్న యువత అక్కడ జరిగే గొడవలకు, కాల్పులకు, రోడ్డు ప్రమాదాలకు బలైపోతున్నారు. రోజురోజుకూ ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయో తప్పా, తగ్గట్లేదు. తాజాగా ఇలాంటి ఘటనే ఆగ్రరాజ్యం అమెరికాలో మరోసారి వెలుగు చూసింది. ఒక దుండగులు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఒక విద్యార్థి ప్రాణాలుకోల్పోయాడు. మృతుడు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు చెందిన చంద్రశేఖర్‌గా గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఎల్బీనగర్‌కు చెందిన చంద్రశేఖర్ స్వదేశంలో బీడీఎస్ పూర్తి చేసుకున్న తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. డాలస్ నగరంలో నివాసం ఉంటూ చదువుకుంటున్నాడు. అలాగే పెట్రోల్ బంకులో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఉదయం పెట్రోల్ పోసుకోవడానికి బంక్ వచ్చిన ఒక వ్యక్తి జరిపిన కాల్పుల్లో ప్రమాదవశాత్తు బుల్లెట్ తగిలి చంద్రశేఖర్ మృతి చెందినట్టు తెలుస్తుంది.
ఇక కాల్పుల్లో చంద్రశేఖర్ మృతి చెందినట్టు తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పై చదువులకోసమని విదేశాలకు వెళ్లి కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడే అని గుండెలు పగిలేలా రోధించారు.చంద్రశేఖర్ మృతదేహాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!