December 12, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

పొరుగింట్లో ప్రమాదం జరిగిందని చూడ్డానికి వెళ్లి ప్రాణాలే కోల్పోయాడు

అప్పటికే ఇంటిలోని రెండు సిలెండర్లు పేలిపోయాయి. అయితే వీరంతా అక్కడున్న సమయంలోనే మూడో సిలెండర్ పేలి ఆ ముక్కలు ఈ నలుగురిపై పడ్డాయి. దీంతో వెంటనే స్థానికులు వీరిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలు ఆర్పేశారు. ఆ తర్వాత ఇంటి యజమానులు అక్కడికి వచ్చారు. అయితే సిలెండర్ పేలి ఇనుప ముక్కలు తలపై పడటంతో తులసీనాధ్ కు తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తులసీ నాథ్ చనిపోయాడు.

ఉదయం పొలనికి వెళ్లి పురుగు మందు కొట్టి ఇంటికి వచ్చిన తులసీనాథ్‌ ప్రమాదం జరిగిన సంగతి తెలిసింది. ప్రమాదానికి కూత వేటు దూరంలోనే తులసీనాథ్ అత్తగారిల్లు ఉంది. అక్కడే భార్య పిల్లులుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న అతను హుటాహుటిన అత్తగారింటికి వెళ్లి ఇంట్లోని విద్యుత్ మెయిన్ ఆపివేసి, గ్యాస్ సిలెండర్ రెగ్యులేటర్ కూడా తొలగించాడు. ఆ తర్వాత ప్రమాద ఘటన స్థలానికి వెళ్లేందుకు సిద్దమయ్యాడు. దీంతో భార్య అక్కడికి వెళ్లవద్దని వారించింది. అయితే దూరంగానే ఉండి చూసివస్తానని వెళ్లిన తులసీ నాధ్ కొద్దీ సేపటికే తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటన తలుచుకొని భార్య పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదం జరిగిన ఇంటిలోని కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉండగా ప్రమాదం చూడటానికి వెళ్లిన వ్యక్తి చనిపోవడం విధి విచిత్రం కాకపోతే మరేంటని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Also read

Related posts

Share via