November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

ఆత్మ హత్య చేసుకుంటున్నానంటూ పోలీసులకు ఫోన్‌.. ఆ తర్వాత.?

శాంతి భద్రతలను కాపాడడంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు పోలీసులు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడుతూ జనాల మన్ననలు పొందుతున్నారు.. తాజాగా ఆత్మహత్య ప్రయత్నం చేసి కొన ఊపిరితో ఉన్న వ్యక్తికి సిపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు పోలీస్ కానిస్టేబుల్..కానిస్టేబుల్ సమయస్ఫూర్తికి అభినందనలు వెలువెత్తుతున్నాయి.. హైదరాబాద్ మహానగరం పరిధిలోని బడంగ్‌పేట్ ప్రాంతంలో నివసిస్తున్న జగన్ అనే వ్యక్తి కుటుంబంలోని ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆత్మహత్యకు పాల్పడే ముందు డయల్ 100కు కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారం అందించాడు. అదే సమయంలో నైట్ డ్యూటీలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ సూర్యనారాయణ నరసింహ వెంటనే స్పందించారు. జగన్ నివాసానికి హుటాహుటిన చేరుకున్నారు. అప్పటికే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు జగన్. ఫ్యాన్‌కు వేలాడుతూ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న జగన్‌ను చూసిన కానిస్టేబుల్ అతన్ని కిందకు దించి సీపీఆర్ చేశారు. దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు జగన్. జగన్ ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ సూర్యనారాయణ నరసింహులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు పోలీసులు. ఆత్మహత్య చేసుకునే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటన వెళ్లి అతని ప్రాణాలను రక్షించిన పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు స్థానికులు.

Also read

Related posts

Share via