ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముద్రా నగర్ రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తుండగా.. అదే ట్రాక్‌పైకి ఒక్కసారిగా ట్రైన్ దూసుకువచ్చింది. అక్కడే ఉన్న రైల్వే సిబ్బంది.. రైలును ఆపమని సూచించేందుకు ఎర్ర జెండాను ఊపారు. చంద్రబాబు అక్కడ ఇరుకైన బ్రిడ్జిపై నిల్చుని ఉండగా.. ట్రైన్ కాస్త స్లో అయ్యి ముందుకెళ్లింది.
విజయవాడలో ఊహించని ఘటన జరిగింది. చంద్రబాబు బుడమేరు పరిశీలనలో ఊపిరిబిగబట్టే సీన్ వెలుగుచూసింది. మధురానగర్‌లో బుడమేరు గండిని పరిశీలించేందుకు వెళ్లారు సీఎం. అయితే గండి సరిగా కనిపించడంలేదని మధురానగర్ రైల్వే ట్రాక్‌పైకి ఎక్కారు. అదే సమయంలో ట్రాక్‌పై దూసుకెళ్లింది ట్రైన్. ఆ సమయంలో ట్రాక్‌పై పక్కన ఉన్న ఇరుకైన స్థలంలోనే చంద్రబాబు సహా ఆయన భద్రతా సిబ్బంది నిల్చున్నారు. ఎలాంటి ప్రమాదం జరక్కపోయినప్పటికీ.. కొన్ని క్షణాలు అందరిలోనూ టెన్షన్ వాతావరణం నెలకుంది. అయితే సీఎం వెళ్తానన్నా.. భద్రతా అధికారులు వెళ్లనివ్వకుండా ఉండాల్సిందని ఇది సెక్యూరిటీ బ్రీచ్ అని చెబుతున్నారు కొందరు రిటైర్డ్ సెక్యూరిటీ అధికారులు
తాజా వార్తలు చదవండి
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!