ఓ విద్యార్థిని ట్రైన్‌లో ప్రయాణిస్తోంది. అర్ధరాత్రి కావడంతో ఘాడ నిద్రలో ఉంది. ఈ సమయంలో ఓ వ్యక్తి ఆమెను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. మెలుకువ రావడంతో ఎదురు తిరిగిన యువతి.. తోటి ప్రయాణికులు సహాయంతో నిందితుడ్ని పట్టుకుంది.
సొసైటీలో కామాంధులు, ఉన్మాదులు బరి తెగిస్తున్నారు. ఎక్కడా కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా రన్నింగ్ ట్రైన్‌లో ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. హౌరా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లో ఓ యువతిని.. ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడు. అర్ధరాత్రి 2గంటల సమయంలో.. ఆమె ఘాడ నిద్రలో ఉండగా.. అసభ్యంగా తాకుతూ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. మెలుకువ రావడంతో.. ఎదురు తిరిగిన బాధితురాలు.. తోటి ప్రయాణికుల సాయంతో కామాంధుడిని పట్టుకుంది. ఆపై నిందితుడ్ని.. సామర్లకోట స్టేషన్ వద్ద ప్రయాణీకులు రైల్వే పోలీసులకు అప్పగించారు
Also read
- నేటి జాతకములు…15 మే, 2025
- మామ వెంటనే నా భార్యను మా ఇంటికి పంపు..!
- వినుకొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
- నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు…108 సర్టిఫికెట్లు స్వాధీనం
- Hyderabad Tragedy: హైదరాబాద్లో విషాదం.. ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసిన పిల్లర్ గుంత!