అందరూ గుడిలో దేవుడ్ని మొక్కేందుకు వెళ్తుంటే.. వీడు మాత్రం కొంచెం తేడా.. మామూలోడు కాదు.. మహాముదురు. భక్తుడి రూపంలో వెళ్లి ఏకంగా అమ్మవారికే పంగనామాలు పెట్టాడు. గుడిలోకెళ్లి పాడుపని చేస్తే.. సీసీ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకెళ్తే.. ఏలూరులోని సత్రంపాడు సౌభాగ్యలక్ష్మీ ఆలయానికి ఓ వ్యక్తి భక్తుడి రూపంలో వచ్చాడు. భక్తితో దేవతకు దణ్ణం పెట్టాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడే వెనకా ముందు ఎవరూ లేదని చూసి.. వెంటనే గర్భగుడిలోకి వెళ్లి.. అమ్మవారి మెడలో ఉన్న బంగారు తాడును కొట్టేశాడు. దాన్ని జేబులో వేసుకుని.. ఎంచక్కా పరారయ్యాడు. ఇక ఇదంతా కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో ఆ వ్యక్తి.. గుడిలో పూజారి, మరే భక్తులు లేని సమయంలో ఈ దొంగతనానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
Also read
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?
- Telangana: కనిపెంచిన కొడుకును కడతేర్చిన తండ్రి.. కారణం తెలిస్తే షాకే
- Andhra: అమ్మతో కలిసి కార్తీకదీపం వెలిగించాలనుకుంది.. తీరా చూస్తే కాసేపటికే..





